Starlink India Leaks
Starlink India Leaks : ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అతి త్వరలో భారత మార్కెట్లోకి ప్రారంభం కానుంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అధికారిక అనుమతులు రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి, స్టార్‌లింక్ మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం (Starlink India Leaks) కలిగి ఉంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. కంపెనీకి దేశంలో పెండింగ్‌లో ఉన్న ఆమోదాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి రానుంది.
స్టార్‌లింక్ ఇండియా, ప్లాన్లు, స్పీడ్, లభ్యత :
భారత మార్కెట్లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌లో బేసిక్ స్పీడ్ హై-స్పీడ్ ప్లాన్ అందించే లైట్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్‌లు అందరికి అందుబాటులో ఉంటాయి. కమర్షియల్ బెనిఫిట్స్ కోసం కస్టమైజడ్ ప్లాన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ధర కూడా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ విషయానికొస్తే.. 25Mbps నుంచి 225Mbps మధ్య ఉంటుందని చెబుతున్నారు.
అయితే, కంపెనీ యునైటెడ్ స్టేట్స్‌లో స్టార్‌లింక్ 300Mbps వరకు స్పీడ్ అందిస్తోంది. భారత్‌లో కూడా ఇంతే ఇంటర్నెట్ స్పీడ్ అందించే అవకాశం ఉంది. లభ్యత విషయానికి వస్తే.. భారత్‌లో స్టార్‌లింక్ కనెక్షన్‌ల సంఖ్యపై భారత ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. అధికారిక నివేదికల ప్రకారం.. దేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే కలిగి ఉంటుంది.
స్టార్ లింక్ ఇండియా లీక్స్.. ధర, లాంచ్ తేదీ :
స్పెక్ట్రమ్ కేటాయింపులతో పాటు ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న కొన్ని ఆమోదాల కోసం స్టార్‌లింక్ ఇండియా ఎదురుచూస్తోంది. ఈ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అంచనాలు ఉన్నాయి. 2026 మొదటి త్రైమాసికం నాటికి దేశంలో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సింగిల్ సెటప్ మాత్రమే.. అయితే దీనికి అయ్యే ఖర్చు దాదాపు రూ. 30వేలు నుంచి రూ. 35వేల వరకు ఉండొచ్చు. అంతేకాకుండా, నెలవారీ ప్లాన్‌లు కూడా భారీగానే ఉంటాయని అంటున్నారు. అందులో లైట్ ప్లాన్ దాదాపు రూ. 6వేలు అయితే హై-స్పీడ్ ప్లాన్ దాదాపు రూ. 10వేలు ఉంటుందని అంచనా.