WhatsApp Android to iOS : వాట్సాప్ ఆండ్రాయిడ్ చాట్ నుంచి ఐఓఎస్‌కు సింపుల్‌గా ఇలా మార్చుకోవచ్చు..!

WhatsApp Chat : ప్రముఖ వాట్సాప్ యూజర్లు ఇప్పుడు Android నుంచి ఏదైనా iOS డివైజ్‌ను సులభంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చునని WhatsApp ప్రకటించింది. టెక్స్ట్ హిస్టరీతో పాటు కంటెంట్ కూడా పంపుకోవచ్చు.

WhatsApp Chat : ప్రముఖ వాట్సాప్ యూజర్లు ఇప్పుడు Android నుంచి ఏదైనా iOS డివైజ్‌ను సులభంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చునని WhatsApp ప్రకటించింది. టెక్స్ట్ హిస్టరీతో పాటు కంటెంట్ కూడా పంపుకోవచ్చు. ఈ వాట్సాప్ ఫీచర్‌ని కంపెనీ గత ఏడాదిలో Galaxy Unpacked ఈవెంట్‌లో ప్రకటించింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్లు చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ డేటాను ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మరొక ఆపరేటింగ్ సిస్టమ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ డేటాను మైగ్రేట్ చేసేందుకు కొన్ని విషయాలను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.

ఈ హ్యాండ్‌సెట్ తప్పనిసరిగా Android వెర్షన్ 5 లేదా అంతకంటే ఎక్కువ వేరియంట్‌లలో రన్ అయ్యేలా ఉండాలి. Apple డివైజ్‌ల కోసం.. iPhone లేదా iPad తప్పనిసరిగా iOS 15.5 అంతకంటే ఎక్కువ వేరియంట్‌లలో అందుబాటులో ఉండాలి. డేటా ట్రాన్స్‌ఫర్ వైర్‌లెస్‌గా జరుగుతుందని గమనించాలి.

మీ రెండు డివైజ్‌లు ఒకే Wi-Fi నెట్‌వర్క్ పరిధిలో ఉండాలి. డేటా మైగ్రేషన్ సమయంలో మీరు తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌ను పవర్ సోర్స్‌తో కనెక్ట్ చేయవచ్చు. Android, iOS డివైజ్‌ల కోసం డేటాను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. WhatsApp డేటాను Android నుంచి iPhoneకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేయండి.

Steps to Transfer WhatsApp chat from Android to iOS

* మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్-స్క్రీన్ Prompt ఫాలో అవ్వండి.
* Move టు iOS యాప్‌ని ఓపెన్ చేసేందుకు Click చేయండి.
* మీరు మీ ఐఫోన్‌లో కోడ్‌ను కనుగొంటారు.
* మీ Android స్మార్ట్‌ఫోన్‌లో అదే Enter చేయండి
* ఇప్పుడు Continue‌పై Tap చేయండి.
* మీరు ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌ను పొందవచ్చు. అదే Follow అవ్వండి.
* Transfer డేటా స్క్రీన్‌పై WhatsAppని ఎంచుకోండి.
* మీ Android డివైజ్ నుంచి ‘Start’పై Tap చేయండి.
* Export కోసం App డేటాను Start చేసే వరకు ఆగండి
* మీరు మీ Android డివైజ్ నుంచి సైన్ అవుట్ అవుతారు.
* డేటా ట్రాన్స్‌ఫర్ రెడీ అవుతుంది.
* Move నుంచి iOS యాప్‌కి తిరిగి వచ్చేందుకు ‘Next’పై Tap చేయండి.
* Android నుంచి iPhoneకి డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ‘Continue’పై Tap చేయండి.
* ఇప్పుడు మీ డేటా Transfer పూర్తి చేసేందుకు Androidని iOSకి ట్రాన్స్‌ఫర్ అయ్యేవరకు ఆగండి.
* మీరు యాప్ స్టోర్ నుంచి యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
* ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మీరు WhatsAppని ఓపెన్ చేయండి.
* మీ ఓల్డ్ డివైజ్‌లో ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
* ప్రాంప్ట్ అయితే.. ‘Start’పై Tap చేయండి. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు అనుమతించండి.
* ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తర్వాత కొత్త డివైజ్‌లో మీ చాట్‌లు Export చేసుకోవచ్చు.
* మీరు బ్యాకప్‌ని క్రియేట్ చేస్తే తప్ప ట్రాన్స్‌ఫర్ చేసినా డేటా iCloudకి అప్‌లోడ్ చేయవచ్చు.
* మీరు మీ డివైజ్ నుంచి యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేంతవరకు లేదా స్టోర్ చేసిన డేటాను మాన్యువల్‌గా డిలీట్ చేసేంతవరకు మీ డేటా Android డివైజ్‌లో అలాగే స్టోర్ చేస్తుంది.
* Android నుంచి iOSకి డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలి.
* ఇప్పుడు మీరు మీ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసేముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

Steps to Transfer WhatsApp chat from Android to iOS

గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి :
* OS 5v లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఏదైనా Android పరికరం ఈ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది
* Apple పరికరాల కోసం, iOS 15.5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఏదైనా సంస్కరణ బదిలీని జరిగేలా అనుమతిస్తుంది.
* 15.5 దిగువన ఉన్న iOS వెర్షన్ డేటా బదిలీ లక్షణానికి మద్దతు ఇవ్వదు
* మీ Android ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన iOS యాప్‌కి తరలించండి
* ఓల్డ్ డివైజ్ నుంచి కొత్తదానికి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీరు ప్రాసెస్ సమయంలో అదే కాంటాక్ట్ నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది
* Android స్మార్ట్‌ఫోన్ నుంచి డేటాను పొందడానికి iOS యాప్‌కు మీ iPhoneని రీసెట్ చేయవచ్చు.
* రెండు డివైజ్‌లు- Android, iOS తప్పనిసరిగా ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాలి.
* రెండు డివైజ్‌లు ఏదో ఒక పవర్ సోర్స్‌కి కనెక్ట్ అయి ఉండాలి లేదా మీరు డివైజ్ 100శాతం ఛార్జ్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple CEO Tim Cook: ప్రాథమిక పాఠశాలలోనే కోడింగ్ నేర్పించాలి.. నేటితరం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన భాష.

ట్రెండింగ్ వార్తలు