Sundar Pichai : గూగుల్ సాఫ్ట్‌వేర్‌లో ఇకపై ఏఐతోనే 25 శాతం కోడింగ్.. ఇంజినీర్ల భవిష్యత్తు ఏంటి? : సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?

Sundar Pichai : గూగుల్ అందించే సాఫ్ట్‌వేర్‌లో మొత్తం కొత్త కోడ్‌లో నాలుగింట ఒక వంతు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిస్తున్నట్టు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.

AI writes 25 Percent of Google software

Sundar Pichai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ముప్పు ఉందా? ఏఐనే మొత్తం పనులు చేస్తే.. మానవ ఇంజినీర్లు ఏం చేయాలి? వారు చేసే పని మొత్తం ఏఐనే చేసేస్తుంటే.. ఇక వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయా? ఇలాంటి అనేక సందేహాలకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం కన్నా ఎక్కువ జనరేట్ చేస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఇంజనీర్లు ఏఐ రాసిన కోడ్ రివ్యూ చేయాల్సి ఉంటుందన్నారు. కంపెనీ మూడవ త్రైమాసిక ఆదాయాల సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ట్రెండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తుంది. ఏఐ కోడింగ్ పనిభారాన్ని పంచుకోవడమే కాకుండా ఇంజనీరింగ్ రోల్స్ కూడా రీస్టోర్ చేస్తుంది. రొటీన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడం ద్వారా గూగుల్ తన ఇంజనీర్‌లను సంక్లిష్టమైన సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా చేస్తోంది. ఏదేమైనా, ఈ పురోగతి ఎంట్రీ-లెవల్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు గురించి కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే.. డెవలప్‌మెంట్ వర్క్‌ఫ్లోలలో ఏఐ ముఖ్యమైన భాగంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోడింగ్, గూగుల్ ఏఐతో ఇంజినీర్లకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండనుందో కంపెనీ సీఈఓ పిచాయ్ వివరించారు.

గూగుల్ కోడ్‌లో నాలుగింట ఒక వంతు ఏఐనే :
సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల కంపెనీ క్యూ3 2024 ఆదాయాల వెల్లడి సందర్భంగా ఒక సంచలనాత్మక అప్‌డేట్‌ను షేర్ చేశారు. గూగుల్ మొత్తం కొత్త కోడ్‌లలో నాలుగింట ఒక వంతు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే, ఈ ఏఐ కోడింగ్ మానవ ఇంజనీర్లు పూర్తిగా రివ్యూ చేయాల్సి ఉంటుంది అన్నారు. ప్రస్తుత రోజుల్లో వేగవంతమైన ఏఐ పాత్రను సూచిస్తుంది. పిచాయ్ ప్రకటనతో ఏఐ మరింతగా గూగుల్ సాఫ్ట్‌వేర్ కోడింగ్ విధానాలపై దృష్టిసారించనుందని సూచిస్తుంది.

ఇంజినీర్లపై ఏఐ ప్రభావం :
ఏఐ రూపొందించిన కోడ్ గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల బాధ్యతలను పునర్నిర్మిస్తోంది. ఇప్పుడు ఏఐ జనరేట్ చేసిన కోడింగ్ రివ్యూ చేయడం, అప్‌గ్రేడ్ చేయడంపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఈ మార్పు ఇంజనీర్‌లు మరింత సాధారణ కోడింగ్ పనులపై సమయాన్ని వెచ్చించడం కన్నా హై లెవల్ సమస్య-పరిష్కారం, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది. ఏఐ కారణంగా ఇంజనీర్లు తమ ఉద్యోగాలను కోల్పోతామనే ఆందోళన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఏఐ కేవలం కోడర్‌లకు అధికారం ఇవ్వవచ్చు. ఇంజనీర్‌ల కోసం ఏఐ రూపొందించిన కోడ్‌ను పర్యవేక్షించడం, స్వీకరించడం, మెరుగుపరచడం సాంప్రదాయ కోడింగ్ మాదిరిగా కీలకంగా మారుతుందని చెప్పవచ్చు.

ఎంట్రీ లెవల్, సాధారణ కోడింగ్ రోల్స్‌కు చిక్కులు :
ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ రోల్ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలను రేకిత్తిస్తోంది. ఏఐ కోడ్ క్రియేషన్ విస్తరిస్తున్న తరుణంలో సాధారణంగా జూనియర్ డెవలపర్‌లకు కేటాయించిన పనులు తగ్గిపోవచ్చు. ఫలితంగా, ఔత్సాహిక కోడర్‌లు ఏఐ ఆధారిత ప్రక్రియలను పూర్తి చేసే నైపుణ్యాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. తద్వారా వారి కెరీర్ రీక్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏఐ సిస్టమ్‌లకు మార్గనిర్దేశం చేసే సామర్థ్యం, ఏఐ అవుట్‌పుట్‌లను ధృవీకరించడం, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం వంటి ప్రధాన సామర్థ్యాలను కలిగి ఉండాలి. ప్రైమరీ కోడింగ్ టాస్కులు ఎక్కువగా ఆటోమాటిక్‌గా మారుతున్నాయి. ఏఐ సంబంధిత వ్యూహాత్మక కోడింగ్ నైపుణ్యాలను పొందడం ద్వారా కోడర్‌లు ఏఐ-ప్రభావిత వర్క్‌ఫోర్స్‌లో నిలదొక్కుకునేలా సన్నద్ధంగా ఉండాలి.

గూగుల్ ఏఐ కేంద్రీకృత విధానం :
కోడింగ్‌లో గూగుల్ ఏఐని వినియోగించి కంపెనీ అంతటా కార్యకలాపాలను క్రమబద్ధీకరించనుంది. టెక్ దిగ్గజం ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌లు, డివైజ్ విభాగాలతో పరిశోధన, మిషన్ లెర్నింగ్, సెక్యూరిటీ టీమ్స్ పునర్నిర్మించింది. ఈ నిర్మాణాత్మక మార్పు గూగుల్ జెమిని వంటి ఏఐ మోడల్స్ వేగవంతమైన విస్తరణను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీమ్స్ మొత్తాన్ని ఏకీకృతం చేయడం ద్వారా సాంకేతిక పురోగతికి ఏఐ ఆధారిత పరిష్కారాలను మరింత సమర్ధవంతంగా అందించాలని గూగుల్ భావిస్తోంది.

కోడింగ్ భవిష్యత్తు ఏంటి? :
పిచాయ్ ప్రకటనతో మానవ ఇంజనీర్‌లకు ఏఐ ఎంతమాత్రం పోటీదారు కాదని తెలుస్తోంది. కేవలం ఇంజినీర్లకు సహకారాన్ని అందించనుందని సూచిస్తుంది. ఏఐ కోడ్‌ను రూపొందించిన తర్వాత డెవలప్‌మెంట్‌లో ఇంజనీర్‌లకు సపోర్టు అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కూడా రూపాంతరం చెంది ఇంజనీర్లు ఏఐ అవుట్‌పుట్‌లను పర్యవేక్షించడం, కోడ్ కచ్చితత్వాన్ని నిర్ధారించడం, మెషిన్ లెర్నింగ్, ఏఐ మానిటరింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కోడింగ్ కెరీర్‌ ముగిసినట్టే అనే భయాందోళనలు లేకుండా మానవ పర్యవేక్షణ క్వాలిటీ, నైతిక ప్రమాణాలతో వినూత్న పరిష్కారాలను ఇంజనీర్‌లకు అందించడమే ఏఐ భవిష్యత్తుగా సూచిస్తుంది.

Read Also : US Elections 2024 : హారిస్ వర్సెస్ ట్రంప్ లేటెస్ట్ పోల్స్ : అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే?