NCAP: టాటా సఫారీ, హారియెర్‌లకు భారత్ ఎన్‌క్యాప్ తొలి ఫైవ్‌స్టార్ రేటింగ్
భారత్-NCAP అనేది వాహన భద్రతపై భారతదేశ స్వతంత్ర, ఆత్మనిర్భర్ వాయిస్. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ గ్లోబల్ స్టాండర్డ్స్‌కు బెంచ్‌మార్క్ చేయబడింది. భారత్-NCAP వాహన రేటింగ్ సిస్టమ్ తప్పనిసరి నిబంధనలకు మించి రహదారి భద్రత, వాహన భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది

టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీలు సఫారీ, హారియెర్ ప్రయాణికుల రక్షణలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. కారులో ప్రయాణించే వారి రక్షణ విషయంలో భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కింద (భారత్-ఎన్‌క్యాప్) ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన తొలి ఎస్‌యూవీలు ఇవే. దేశంలో తిరిగే వాహనాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు దీటుగా నిలిపేందుకు వీలుగా భారత్-ఎన్‌క్యాప్ ను గత ఆగస్టులో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. సఫారీ, హారియెర్ భారత్-ఎన్‌క్యాప్ కింద సర్టిఫై కావడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరి హర్షం ప్రకటిస్తూ కంపెనీని అభినందించారు.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ “భారత్-NCAP అనేది వాహన భద్రతపై భారతదేశ స్వతంత్ర, ఆత్మనిర్భర్ వాయిస్. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ గ్లోబల్ స్టాండర్డ్స్‌కు బెంచ్‌మార్క్ చేయబడింది. భారత్-NCAP వాహన రేటింగ్ సిస్టమ్ తప్పనిసరి నిబంధనలకు మించి రహదారి భద్రత, వాహన భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. ఈ రోజు అత్యధికంగా సాధించగల 5-స్టార్ రేటింగ్‌తో ధృవీకరించబడిన మొట్టమొదటి వాహనాలు టాటా మోటార్స్ నుంచి వచ్చినందుకు సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.
కొత్త సఫారి & హారియర్ లో ప్రధాన భద్రతా ఫీచర్లు
7 ఎయిర్‌బ్యాగ్‌లు 6 స్టాండర్డ్‌గా పర్సోనా అంతటా ఉన్నాయి
ప్రామాణికంగా ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ
అన్ని వరుసలలో 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్
ఐసోఫిక్స్ టెథర్స్
రిట్రాక్టర్, ప్రిటెన్షనర్, లోడ్ లిమిటర్ (RPLL), యాంకర్ ప్రిటెన్షనర్‌తో కూడిన సీట్‌బెల్ట్‌లు
సిమెట్రిక్ క్రాష్ పనితీరు, సైడ్ పోల్ ఇంపాక్ట్ అందించడానికి రీన్‌ఫోర్స్డ్ క్యాబిన్ నిర్మాణం మెరుగుపరచబడింది.