TCS CodeVita: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రోగ్రాంతో గిన్నీస్ రికార్డు సాధించిన టీసీఎస్
టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రోగ్రామింగ్ కాంటెస్ట్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ దక్కించుకుంది. వరల్డ్ లార్జెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ 9వ సీజన్లో 34 దేశాల నుంచి..

Tcs Codevita Wins Guinness For Worlds Largest Computer Programming Competition
TCS CodeVita: టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రోగ్రామింగ్ కాంటెస్ట్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ దక్కించుకుంది. వరల్డ్ లార్జెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ 9వ సీజన్లో 34 దేశాల నుంచి లక్షా 36వేల 54మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
2021 టీసీఎస్ కోడ్ విటా కాంపిటీషన్ ప్రపంచవ్యాప్తంగా కాలేజీ స్టూడెంట్లను దీనికి ఆహ్వానించింది. వారి ప్రోగ్రాం స్కిల్స్ ను చూపించి విశ్వ వ్యాప్తంగా ప్రోగ్రామర్స్ లో ర్యాంకు దక్కించుకునే అవకాశం కల్పించింది.
వారి నాలెడ్జ్, కోడింగ్ స్కిల్స్ ను టెస్టు చేశాం. కాంప్లెక్స్ రియల్ వరల్డ్ సమస్యలను ఆరు గంటల సమయంలోనే సాల్వ్ చేశారు. విన్నర్లకు క్యాష్ ప్రైజులు ఇచ్చాం. ఇంటర్న్ షిప్ ఆఫర్లు గెలుచుకున్న వాళ్లూ ఉన్నారు.
ఈ ఏడాది ఛాంపియన్ గా బెన్ అలెగ్జాండర్ మిర్చౌక్, న్యూజెర్సీకి చెందిన వ్యక్తి నిలిచాడు. టాప్ 3 కోడ్ విన్నర్లకు 10వేల డాలర్లు, 7వేల డాలర్లు, 3వేల డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించినట్లుగానే అందజేశారు. అంతేకాకుండా వారికి ఇంటర్న్ షిప్ కోసం నేరుగా కంపెనీని కన్సల్ట్ అయ్యే అవకాశం కల్పించారు.