Aadhaar PhonePe UPI
Aadhaar PhonePe UPI : మీరు ఫోన్‌పే (PhonePe) వాడుతున్నారా? యూపీఐ ద్వారా పేమెంట్స్ (UPI Payments) ఎక్కువగా చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే.. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాంలో ఒకటైన PhonePay సర్వీసులను ప్రస్తుతం 350 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. అత్యంత పాపులర్ ఇన్‌స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. UPI పేమెంట్స్ ప్రక్రియతో పాటు ఎప్పుడైనా తమ బ్యాంక్ అకౌంట్లను డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. అయితే యూజర్లు యూపీఐ పేమెంట్ చేయాలంటే OTP అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి UPI యాక్టివేషన్‌ను పూర్తి చేయడానికి PhonePe కొత్త యూజర్లకు అనుమతిస్తుంది. Google Pay, Paytm లేదా PhonePeతో సహా ఏదైనా యాప్‌లో UPIని సెటప్ చేసుకోవచ్చు. OTP అథెంటికేషన్ పొందడానికి యూజర్ UPI పిన్‌ను సెటప్ చేసుకోవాలి. వినియోగదారులు డెబిట్ కార్డ్ డేటాను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ డెబిట్ కార్డ్ అందుబాటులో లేని పెద్ద సంఖ్యలో భారతీయ బ్యాంక్ ఖాతాదారులకు రిజిస్ట్రేషన్ యాక్సెస్‌ని పరిమితం చేసింది. కానీ UPI యాక్టివేషన్ కోసం కొత్త ఆధార్ ఆధారిత OTP అథెంటికేషన్ ఎక్కువ మంది యూజర్లు UPI సర్వీసులు వినియోగించుకోవచ్చు. మీరు కొత్త యూజర్ అయితే ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ UPIని సెటప్ చేసుకోవచ్చు.