WhatsApp Status
Tech Tips in Telugu : వాట్సాప్ యూజర్లు మీ లొకేషన్ కూడా స్టేటస్‌లో షేర్ చేసుకోవచ్చు. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది.
ఇటీవలే మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఫీచర్‌ల మాదిరిగానే వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఫొటోను అప్‌లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్‌తో పాటు మీ వాట్సాప్ స్టేటస్‌కు లొకేషన్‌ను కూడా యాడ్ చేయొచ్చు. మీ వాట్సాప్ స్టేటస్‌కు లొకేషన్‌ను ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీ వాట్సాప్ స్టేటస్ లొకేషన్ ఎలా యాడ్ చేయాలి? :
ఈ కొత్త ఫీచర్లతో మ్యూజిక్, లొకేషన్ ట్యాగ్స్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో తమ కాంటాక్ట్‌లను యాడ్ చేయొచ్చు. వాట్సాప్ ఈ అప్‌డేట్స్ ద్వారా యూజర్లను మరింత కనెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని ఇంటరాక్టివ్ లొకేషన్‌లను అందిస్తుంది.
వినియోగదారులు తమ లొకేషన్ విజువల్ కంటెంట్‌తో షేర్ చేయొచ్చు. మీ వాట్సాప్ స్టేటస్ లోకేషన్లను సులభంగా యాడ్ చేయొచ్చు. మీ అప్‌డేట్స్ చూసే వారికి సమాచారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు.