Tech Tips in Telugu : నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో కాల్స్ చేయొచ్చు తెలుసా? 99 శాతం మందికి ఈ ట్రిక్ తెలియదు..!

Tech Tips in Telugu : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీకు ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా కాల్ లేదా మెసేజ్ చేయడం తెలుసా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది.. అదేంటో తెలిస్తే మీరు కూడా ఈజీగా ఎవరికైనా నంబర్ సేవ్ చేయకుండానే ఫోన్ కాల్స్ చేయొచ్చు.

How to Make a Call on WhatsApp

Tech Tips in Telugu : దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. కానీ, కొన్నిసార్లు నంబర్ సేవ్ చేయకుండా ఎవరికైనా కాల్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇంతకుముందు ఇందుకోసం నంబర్‌ను సేవ్ చేసుకోవడం అవసరం ఉండేది.

కానీ, ఇప్పుడు మీరు నంబర్‌ను సేవ్ చేయాల్సిన పనిలేదు. నేరుగా ఎవరికైనా వాట్సాప్ కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లోని ఈ కొత్త ఫీచర్ గురించి చాలా మందికి తెలియదు. నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్స్ చేసేందుకు ఈ సింపుల్ ట్రిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Vivo Y300i Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ చూశారా..? ధర, ఫీచర్లు మాత్రం కెవ్వు కేక.. ఓసారి లుక్కేయండి!

కొత్త ఫీచర్‌తో నేరుగా కాల్స్ చేయొచ్చు :
ఇప్పుడు, కొత్త వాట్సాప్ అప్‌డేట్ తర్వాత నంబర్‌ను సేవ్ చేయకుండా కూడా కాల్స్ చేయవచ్చు. ఇందుకోసం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కాలింగ్ సెక్షన్ వెళ్లండి. ‘+’ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. ఇక్కడ ‘Call Number’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై మీ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ నంబర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంటే మీరు నేరుగా కాల్ చేయవచ్చు.

వెబ్ బ్రౌజర్ నుంచి కాల్స్ చేయొచ్చు :
ఈ ఫీచర్ యాప్‌లో అందుబాటులో లేకపోతే.. మీరు బ్రౌజర్‌ని ఉపయోగించి నంబర్‌ను సేవ్ చేయకుండానే కాల్స్ చేయవచ్చు. ఇందుకోసం (Chrome) లేదా (Safari) బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి. అడ్రస్ బార్‌లో (https://wa.me/91XXXXXXXXXX) అని టైప్ చేయండి.

ఇందులో X దగ్గర  మీర ఎవరికి ఫోన్ కాల్ చేయాలో 10 అంకెల నెంబర్ టైప్ చేయండి. (91 తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి). ఆ తర్వాత Go ట్యాప్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాల్ లేదా మెసేజ్ పంపవచ్చు.

Read Also : Best 5G Phones 2025 : కొత్త ఫోన్ కావాలా? ఈ నెలలో రూ.25వేల లోపు ధరలో బెస్ట్ 5జీ మొబైల్ ఫోన్లు మీకోసం.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఎవరికి బెనిఫిట్ అంటే? :
కొత్త నంబర్ నుంచి మళ్లీ మళ్లీ చాట్ చేయాల్సిన లేదా కాల్ చేయాల్సిన వారికి ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, డెలివరీ ఏజెంట్లు, హోటల్, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు అందించేవాళ్లు కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. అయితే, నంబర్‌ను సేవ్ చేయకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఈ చిన్న ట్రిక్ ద్వారా కొత్తవారితో లేదా ఎవరితైనా సులభంగా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు.