Best 5G Phones 2025 : కొత్త ఫోన్ కావాలా? ఈ నెలలో రూ.25వేల లోపు ధరలో బెస్ట్ 5జీ మొబైల్ ఫోన్లు మీకోసం.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best 5G Phones India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ మార్చిలో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5G మొబైల్ ఫోన్లు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Best 5G mobile phones
Best 5G Phones India 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక కొత్త బ్రాండ్ల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది తెలుసుకోవడం కష్టమే. దాదాపు అన్ని ఫోన్లలో మంచి ఫీచర్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులకు నచ్చిన ఫోన్ ఎంచుకోవడంలో గందరగోళంగా ఉండొచ్చు.
అద్భుతమైన కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, స్పీడ్ ఛార్జింగ్ వంటి ఆప్షన్లు కలిగిన ఫోన్ల కోసం మీరు కూడా చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఇటీవలే కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 3a సహా మూడు ఇతర అద్భుతమైన మోడల్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ మార్చి నెలలో రూ. 25వేల లోపు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3a :
నథింగ్ ఫోన్ 2aకు అప్‌గ్రేడ్ వెర్షన్ నథింగ్ ఫోన్ 3a మోడల్. ఈ కొత్త ఫోన్ మీడియాటెక్ నుంచి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌కు మారింది. మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బ్యాక్ సైడ్ ఐకానిక్ గ్లిఫ్ లైట్లు అలాగే ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 3a మోడల్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా క్లీన్, నేచురల్ నథింగ్ OS 3.1 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. రోజంతా వినియోగానికి 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. కెమెరా సెటప్ కొత్త 50ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో అప్‌గ్రేడ్ అయింది. రూ. 24,999 ధరలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. క్లాసిక్ వైట్, బ్లాక్ ఆప్షన్‌లతో పాటు ఫ్రెష్ బ్లూ వేరియంట్‌లో లభ్యమవుతుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE4 5జీ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 మోడల్ గత మోడల్ ఫోన్ కన్నా భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడిన 120Hz అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీ ఫోన్ స్క్రీన్‌పై చేతులు తడిగా ఉన్నప్పుడు వేగంగా పనిచేస్తుంది.
భారీ 5,500mAh బ్యాటరీతో మీ ఫోన్‌ను రోజంతా వాడుకోవచ్చు. రీఛార్జ్ చేసేందుకు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండగా కేవలం 30 నిమిషాల్లో రీఛార్జ్ అవుతుంది. 50ఎంపీ సోనీ (LYT600) సెన్సార్ కెమెరా సిస్టమ్, వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీయొచ్చు.
పోకో X7 5జీ :
పోకో X7 ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టూ-టోన్ ఎండ్ సిగ్నేచర్ పోకో ఎల్లోతో వస్తుంది. హుడ్ కింద మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది.
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, కలర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ ధర రేంజ్‌లో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
లావా అగ్ని 3 5జీ :
లావా అగ్ని 3 5జీ ఫోన్ డ్యూయల్ అమోల్డ్ డిస్‌ప్లేలతో వస్తుంది. ప్రైమరీ 6.78-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గేమింగ్, మీడియాకు బెస్ట్ అని చెప్పవచ్చు. నోటిఫికేషన్‌లు, సెల్ఫీ ప్రివ్యూలు, విడ్జెట్‌లను చెక్ చేసుకోవచ్చు.
ఇందుకోసం 1.74-అంగుళాల బ్యాక్ మినీ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300X చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 8జీబీ (LPDDR5) ర్యామ్, 256జీబీ వరకు UFS 3.1 స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లాంగ్ టైమ్ బ్యాటరీని అందిస్తుంది. లావా ఫోన్ 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది.