Best Mobile Phones : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. ఈ మార్చిలో రూ. 15వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Mobile Phones : ఈ మార్చిలో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Best Mobile Phones
Best Mobile Phones : కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ మార్చిలో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరకే అద్భుతమైన ఆప్షన్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన పనితీరు, కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. సాధారణ గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా సెల్ఫీ కెమెరాతో ఫోన్ కావాలనుకున్నా అందరికీ ఏదో ఒకటి ఉంటుంది.
మీరు కూడా ఇలాంటి ఫోన్ల కోసం చూస్తుంటే.. ఈ నెలలో భారత మార్కెట్లో మీరు రూ. 15వేల లోపు ధరకు కొనుగోలు చేయగల టాప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో పోకో M7 ప్రో 5Gతో పాటు మరో మూడు ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
పోకో ఎం7 ప్రో 5జీ :
పోకో M7 ప్రో 5G ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సున్నితమైన విజువల్స్, పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.
8జీబీ ర్యామ్ మల్టీ టాస్కింగ్, డెయిలీ గేమింగ్‌కు సరిపోతుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఆకర్షణీయమైన షాట్‌లను తీయొచ్చు. అయితే, 20ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయొచ్చు. 5,110mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా పవర్ అప్ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్‌తో రోజంతా వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ఓఎస్ రన్ అయ్యే ఈ సాఫ్ట్‌వేర్ క్లీన్‌గా ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ 15కి అప్‌డేట్ చేయడం ద్వారా మరింత వేగంగా పనిచేస్తుంది.
సీఎంఎఫ్ ఫోన్ 1 :
నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ 1 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇందులో స్పెషల్ ఫీచర్ బ్యాక్ కవర్లను నచ్చిన విధంగా లుక్ మార్చుకోవచ్చు. హుడ్ కింద, మీడియాటెక్ డైమన్షిటీ 7300 రోజువారీ పనులు, బ్రౌజింగ్, సాధారణ గేమింగ్ కోసం వినియోగించవచ్చు.
6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా డే టైమ్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ ధరలో ఇతర ఫోన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. నథింగ్ ఓఎస్ 3.0 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది.
రెడ్‌మి 13 5G :
రెడ్‌మి 12 5జీ కన్నా అప్‌గ్రేడ్ చేసిన రెడ్‌మి 13 5జీ అప్‌గ్రేడ్ అందిస్తుంది. 120Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే స్క్రోలింగ్, గేమింగ్‌ను అందిస్తుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో మంచి లైటింగ్‌లో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయొచ్చు. 5,000mAh బ్యాటరీ మారదు. కానీ, ఛార్జింగ్ స్పీడ్ 33Wకి పెరిగింది.
షావోమీ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తోంది. ఆండ్రాయిడ్ 14 పైన హైపర్ఓఎస్ రన్ అయ్యే యూఐ ఇప్పుడు మునుపటి MIUI వెర్షన్‌లతో పోలిస్తే వేగంగా రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా సామర్థ్యాలతో రెడ్‌మి 13 బడ్జెట్ 5జీ పోటీదారుగా నిలిచింది.
మోటరోలా G64 5జీ :
స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి మోటరోలా G64 5G అద్భుతమైన ఆప్షన్. మీడియాటెక్ డైమన్షిటీ 7025పై రన్ అవుతుంది. రోజువారీ పనులు, గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. భారీ 6,000mAh బ్యాటరీతో ఒకే ఛార్జ్‌లో ఒక రోజు కన్నా ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటుంది.
OISతో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా అద్భుతమైన షాట్‌లను తీయొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ 14పై రన్ అయ్యే యూఐ క్లట్టర్-ఫ్రీ కలిగి ఉంది. బేస్ వేరియంట్ రూ. 15వేల బడ్జెట్‌లో వస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో హై-ఎండ్ మోడల్ మించిపోయింది. అదనపు మెమరీ, స్టోరేజీ అవసరమయ్యే యూజర్లకు సరైన ఫోన్ అని చెప్పవచ్చు.