Summer AC Offers : సమ్మర్ ఆగయా.. ఏసీలపై ఆఫర్లే ఆఫర్లు.. ఈ 4 ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. డబ్బులు, విద్యుత్ రెండూ ఆదా..!
Summer AC Offers : వేసవిలో ఏసీలు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై 53 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 4 ఏసీలపై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో ఓసారి చెక్ చేసి కొనుగోలు చేయండి.

Summer AC Offers
Summer AC Offers : అయ్య బాబోయ్ సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మెల్లగా పెరిగిపోతున్నాయి. ఈ సమ్మర్‌లో కూలర్లు, ఏసీలు లేకుండా ఇంట్లో ఉండటం కష్టమే. వేసవి రాగానే ఏసీలు, కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఎండలు ముదిరేకొద్ది ఈ ఏసీల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. అందుకే ముందుగానే ఏసీలను కొనేసుకోవడం బెటర్.
మీరు కూడా ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. ఏసీల ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో LG, Haier, Lloyd, Voltas వంటి బ్రాండ్ల ఏసీలపై ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఏసీలపై 53 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. తక్కువ ధరలకు లభించే 5 బెస్ట్ ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1 : లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ :
లాయిడ్ బ్రాండ్ ఏసీ 3 స్టార్ (BEE) రేటింగ్‌తో వస్తుంది. 15 శాతం వరకు పవర్ సేవ్ చేయగలదు. ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్ అనే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. లాయిడ్స్ 1.5-టన్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ మోడ్రాన్ ఇళ్లలో స్మార్ట్ కూలింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఏసీ ధర రూ.58,990 ఉండగా, 41శాతం తగ్గింపుతో రూ.34,490కి లభ్యమవుతుంది.
2 : వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ :
వోల్టాస్ బ్రాండ్ ఏసీ 185V CAS(4503690) కాపర్ కండెన్సర్‌తో వస్తుంది. ఈ 5 స్టార్ (BEE) రేటింగ్ ఏసీ ఆటో-క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. గాలిలో తేమను తొలగిస్తుంది. హానికరమైన బూజు, బ్యాక్టీరియా ప్రమాదాన్ని నివారిస్తుంది. దాంతో ఆవిరిపోరేటర్ కాయిల్‌ను సులభంగా శుభ్రం చేయొచ్చు. ఈ ఏసీ ధర రూ. 75,990 ఉండగా. ప్రస్తుతం 44 శాతం డిస్కౌంట్ ద్వారా కేవలం రూ. 41,990కి లభ్యమవుతుంది.
3 : ఎల్‌జీ ఏఐ కన్వర్టిబుల్ 1.5 టన్ ఏసీ :
ఎల్‌జీ కంపెనీకి చెందిన ఈ ఏసీ ఒకటిన్నర టన్ను సామర్థ్యంతో వస్తుంది. ఈ ఏసీ 3 స్టార్ (BEE) రేటింగ్‌తో వస్తుంది. 15 శాతం వరకు పవర్ సేవ్ చేస్తుంది. ఈ ఏసీ ధర రూ. 78,990 ఉండగా, 53శాతాం డిస్కౌంట్ ద్వారా రూ. 36,990కు కొనుగోలు చేయొచ్చు.
4 : హైయర్ 5 ఇన్ 1 కన్వర్టిబుల్ 1.5 టన్ ఏసీ :
హైయర్ కంపెనీ అందించే ఏసీలో మైక్రో బాక్టీరియల్ ఫిల్టర్ కలిగిన 5 స్టార్ డ్యూయల్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఉంది. 5 స్టార్ (BEE) రేటింగ్ కలిగి ఉంది. అంతేకాదు.. 25 శాతం వరకు పవర్ ఆదా చేయగలదు. రూ. 71వేల ధర కలిగిన ఈ ఏసీపై 42శాతం తగ్గింపు లభిస్తోంది. ఆ తర్వాత ఈ ఏసీ ధర రూ. 40,490కు అందుబాటులో ఉంది.