PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత పడే నెల ఇదే.. అప్పటిలోగా ఈ చిన్న పని పూర్తి చేయండి.. లేదంటే డబ్బులు పడవు!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ఇప్పటివరకూ లబ్ధిదారుల రైతులకు 19 వాయిదాలు అందాయి. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

PM Kisan 20th Installment
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. మరొ కొద్ది నెలల్లో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున వాయిదాలలో పంపిణీ చేస్తోంది.
19వ విడత డబ్బులు పడిన తర్వాత ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 19 వాయిదాల్లో లబ్ధిదారుల రైతులకు డబ్బులు అందాయి. ఇప్పుడు రైతులు మరో విడత డబ్బులు పడనున్నాయి.
2025 ఫిబ్రవరి 24న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల కోసం పీఎం కిసాన్ యోజన 19వ విడతను విడుదల చేశారు. ఈ వాయిదాల డబ్బును (DBT) విధానం ద్వారా లబ్ధిదారుల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
20వ విడత జూన్‌లో విడుదలయ్యే అవకాశం :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి విడత సుమారు 4 నెలల వ్యవధిలో వస్తుంది. 18వ విడత అక్టోబర్ 5, 2024న విడుదలైంది. ఆ తరువాత 4 నెలల తర్వాత అంటే.. 2025 ఫిబ్రవరి 24న 19వ విడత విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత జూన్ నెలలో విడుదల కావచ్చని అంచనా.
అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి ఇంకా సమయం ఉంది. ఈలోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. చాలా మంది రైతులకు ఈ-కెవైసీ, సాగు భూమి ధృవీకరణ జరగలేదు.
దీని కారణంగా వారు 19వ విడత ప్రయోజనాన్ని పొందలేకపోయారు. మీరు కూడా అలాంటి రైతుల జాబితాలో ఉంటే.. మీకు మరో అవకాశం. 20వ విడత విడుదలయ్యేలోపు ఈ పనిని పూర్తి చేయాలి. లేదంటే.. మీరు 20వ విడత డబ్బులను కూడా కోల్పోతారు.
ఈ-కేవైసీ చేయకపోతే డబ్బులు పడవు :
మీరు e-KYC చేయకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. రైతులు e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇందుకోసం మీరు పథకం అధికారిక వెబ్‌సైట్ (www.pmkishan.gov.in)ని విజిట్ చేయడం ద్వారా e-KYC చేయవచ్చు. ఇది కాకుండా, సమీప సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి వారి (e-KYC) పనిని పూర్తి చేసుకోవచ్చు. ఈ-కెవైసి చేయించుకోని రైతులకు ఈ పథకం ప్రయోజనం లభించదని గమనించాలి.
రైతుల భూమి ధృవీకరణ తప్పనిసరి :
రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి. అంతేకాదు.. ఆధార్ లింక్ చేయకపోయినా, పథకానికి సంబంధించిన డబ్బు వారి అకౌంట్లలో పడదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఫండ్ తదుపరి విడత విడుదలకు ఇంకా దాదాపు 4 నెలలు మిగిలి ఉన్నాయి.
రైతులు పథకం ప్రయోజన మొత్తాన్ని సకాలంలో పొందాలంటే పూర్తి చేయని ఏమైనా ఉంటే ఇప్పుడే చేసుకోవడం మంచిది. లేదంటే డబ్బులు పడేవరకు వేచి ఉంటే రావాల్సిన డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంటుంది.