Flipkart Big Saving Days : ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ సేల్.. ఈ 5 ఐఫోన్‌లు చాలా చీప్ గురూ.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Flipkart Big Saving Days : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది. అనేక ఐఫోన్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.

Flipkart Big Saving Days
Flipkart Big Saving Days : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఈ ప్లాట్‌ఫామ్ భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 14 వంటి కొన్ని పాపులర్ ఐఫోన్లపై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.10వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇటీవల లాంచ్ అయిన ఐఫోన్ 16e కూడా బ్యాంక్ ఆఫర్లతో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అన్ని డీల్స్‌ను ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 16పై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ను రూ.68,999కి విక్రయిస్తోంది. ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ.79,900కి లాంచ్ అయింది. అంటే.. ఈ ఐఫోన్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.10,901 తగ్గింపును అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌పై రూ.4వేల డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ధర రూ.64,999కి తగ్గింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎంచుకుంటే మీరు మరింత తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16eపై డిస్కౌంట్ :
కొత్త ఆపిల్ ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ.4వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని లేటెస్ట్ జాబితా ప్రకారం.. ఈ ఐఫోన్ ధర రూ.59,900 నుంచి రూ.55,900కి తగ్గుతుంది. అంటే.. మీరు తక్కువ ధరకు లేటెస్ట్ ఏఐ ఫీచర్లతో ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సిరీస్‌లో ఖరీదైన మోడల్ ఐఫోన్ 16 ప్రో కూడా ఉంది. ఇప్పుడు అత్యంత చౌకగా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. ఐఫోన్ ప్రో వెర్షన్ ఇప్పుడు రూ.1,12,900కి అమ్ముడవుతోంది. అయితే, ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ.1,19,900కు కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ ధరపై రూ. 7వేలకు డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఐఫోన్ 16ప్రో ధర రూ. 1,08,900కి తగ్గింది.
ఐఫోన్ 15పై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. అమెజాన్‌లో ఇదే ఐఫోన్ తక్కువ ధరకు లభ్యమవుతోంది. అమెజాన్ ఈ ఐఫోన్ రూ.61,499కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,999కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 రూ.69,999కి అమ్ముడవుతోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మీరు ఈ ఐఫోన్ రూ.65వేల లోపు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కొనుగోలు చేయడం కన్నా అమెజాన్‌లోనే కొంటే బెటర్.
ఐఫోన్ 13పై డిస్కౌంట్ :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ.44,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ ధర రూ.42,749కి తగ్గుతుంది. అదే సమయంలో, మీరు ఐఫోన్ 14 కొనాలని చూస్తుంటే.. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రూ.54,999కి అమ్ముడవుతోంది.