SIP Benefits : తక్కువ రిస్క్.. హై రిటర్న్స్.. SIPలో జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. దెబ్బకు మీ లైఫ్ సెటిల్ అయినట్టే..!

SIP Benefits : ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ఎస్ఐపీలో నెలకు కేవలం రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తూ పోండి చాలు.. కొన్నాళ్లకు మీకు ఊహించని రీతిలో డబ్బులు వస్తాయి. జీవితంలో డబ్బుకు కొరత లేకుండా బతికేయొచ్చు.

SIP Benefits : తక్కువ రిస్క్.. హై రిటర్న్స్.. SIPలో జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. దెబ్బకు మీ లైఫ్ సెటిల్ అయినట్టే..!

systematic investment plan

Updated On : March 8, 2025 / 7:51 PM IST

SIP Benefits : డబ్బు చెట్లకు కాయదు.. మనమే సంపాదించుకోవాలి.. ప్రస్తుత రోజుల్లో డబ్బుతోనే అన్ని ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ డబ్బు వెంట అందరూ పరుగులు పెడుతుంటారు. అయితే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో చాలామందికి తెలియకపోవచ్చు.

మీరు ఒకవేళ, క్రమం తప్పకుండా SIPలో పెట్టుబడి పెడితే మాత్రం డబ్బు దానంతట అదే పెరుగుతూ పోతుంది.  మొక్కకు నీరు పోస్తే ఎలా అది చెట్టులా మారి ఎదుగుతూ పోతుందో అలాగే సిప్ పెట్టుబడి డబ్బులు కూడా అంతే వేగంగా పెరుగుతూ పోతాయి. ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఓపిక చాలా అవసరం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవారికి ఎస్ఐపీతో అధిక ప్రయోజనాలు ఉన్నాయని గమనించాలి.

Read Also : iPhone 17 Pro Max Launch : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ డేట్ ఇదేనట.. ఫీచర్లు, డిజైన్, ధర వివరాలివే..!

ముందుగా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి.. అదే నెమ్మదిగా పెరగడం మొదలువుతుంది. కొద్ది సంవత్సరాల్లోనే భారీగా డబ్బు జమ అవుతుంది. మీరు 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5వేలు SIP చేశారంటే.. మ్యూచువల్ ఫండ్ల సగటు రాబడి సంవత్సరానికి 12శాతంగా ఉంటే.. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం రూ. 11,61,695 అవుతుంది. 10 ఏళ్లలో ప్రతి నెలా రూ. 5వేలు అంటే మొత్తం రూ. 6లక్షలు (రూ. 5వేలు x 12 నెలలు x 10 ఏళ్లు) పెట్టుబడి పెడతారు.

12శాతం వార్షిక రాబడితో మీ పెట్టుబడి 10 ఏళ్లలో రూ. 5,61,695కి పెరుగుతుంది. మొత్తం మీద 10 ఏళ్ల తర్వాత మీకు దాదాపు రూ. 11,61,695 (రూ.6లక్షలు + రూ.5,61,695) వస్తుంది. మీరు 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 10వేలు SIP చేస్తే.. సగటు మ్యూచువల్ ఫండ్ రాబడి ఏడాదికి 12శాతంగా ఉంటే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 23,23,391 అవుతుంది. అదేవిధంగా, మీరు 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 15వేలు ఎస్ఐపీ చేస్తే రాబడి ఏడాదికి 12శాతంతో మీ మొత్తం పెట్టుబడి రూ. 34,84,695 అవుతుంది.

ఎస్ఐపీ (SIP) ప్రయోజనాలివే :
ఎస్ఐపీ క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతి నెలా మీ డబ్బులో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అది కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. ఎస్ఐపీ ద్వారా మీరు తక్కువ ఖర్చుతో ప్రయోజనాన్ని పొందవచ్చు. మార్కెట్ పడిపోయినా ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయొచ్చు. మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి.

ఎస్ఐపీలో దీర్ఘకాలిక పెట్టుబడితోనే ప్రయోజనాలు ఎక్కువ. ఓపికగా ఉండి పెట్టుబడి పెడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో మంచి రాబడిని పొందవచ్చు. మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ, ఎస్ఐపీలో పెట్టుబడి కాలక్రమేణా పెరుగుతుంది. అధిక లాభాలను తెచ్చిపెడుతుంది.

Read Also : IRCTC Goa Tour Package : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. IRCTC అద్భుతమైన ప్యాకేజీ ఇదిగో.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే?

ఎస్ఐపీలో పెట్టుబడితో పెద్దగా రిస్క్ ఉండదు. డబ్బును చిన్న వాయిదాలలో పెట్టుబడి పెడతారు. తద్వారా మొత్తం పెట్టుబడిపై రిస్క్ తగ్గుతుంది. ఈ ఎస్ఐపీ ప్లాన్ ప్రారంభించడం చాలా సులభం కూడా. మీకు బ్యాంక్ అకౌంట్, కొంత అవగాహన ఉంటే చాలు.. ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

ఎస్ఐపీ ఎలా ప్రారంభించాలి? :
పెట్టుబడికి సరైన మ్యూచువల్ ఫండ్‌ ఎంచుకోవాలి. SIP కోసం మీ బ్యాంక్ అకౌంట్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌కు లింక్ చేయాలి. తద్వారా ప్రతి నెలా స్థిర మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ప్రతి నెలా ఎంత మొత్తంలో ఎంత కాలం పెట్టుబడి పెడతారో నిర్ణయించుకోండి. అన్ని అనుకున్నాక ఎస్ఐపీ మొదలుపెట్టండి. ప్రతి నెల ప్రారంభంలో మీ అకౌంట్ నుంచి ఆ మొత్తం కట్ అవుతుంటుంది.