IRCTC Goa Tour Package : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. IRCTC అద్భుతమైన ప్యాకేజీ ఇదిగో.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే?

IRCTC Goa Tour Package : గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. మీ బడ్జెట్‌లోనే గోవా ట్రిప్ వెళ్లిరావచ్చు. ప్యాకేజీ ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

IRCTC Goa Tour Package : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. IRCTC అద్భుతమైన ప్యాకేజీ ఇదిగో.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే?

Irctc goa tour package

Updated On : March 8, 2025 / 6:56 PM IST

IRCTC Goa Tour Package : గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ సమయంలో మీ జర్నీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు గోవాలోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు గోవా అందాలను దగ్గరగా చూస్తే ఎంజాయ్ చేయాలంటే.. మీ బడ్జెట్‌లోనే ఈ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇప్పుడే బుక్ చేసుకోండి. ఈ వేసవిలో గోవా టూర్ అసలు మిస్ చేసుకోవద్దు.

Read Also : Samsung Galaxy S25 Edge : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌‌కు ముందే కీలక వివరాలు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

3 నైట్స్, 4 డే టైమ్.. డిలైట్ టూర్ ప్యాకేజీ :
ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీలో కోడ్ (SHA03) అనే ‘గోవా డిలైట్’ పేరుతో ప్రారంభించింది. ఈ ప్యాకేజీ కింద 3 నైట్స్, 4 డే టైమ్స్ వరకు గోవాలోని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఫుల్ జర్నీ ప్లాన్, ప్రారంభ తేదీ వివరాలివే :
మీ ప్రయాణం సాఫీగా ఉండేలా ఫ్లయిట్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
స్థానిక ప్రదేశాలను విజిట్ చేసేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
ఈ ప్యాకేజీ మార్చి 20, 2025 నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌ లోకేషన్ నుంచే ట్రిప్ మొదలువుతుంది.

ఫుడ్, రూమ్ సౌకర్యాలివే :
టూర్ ప్యాకేజీలో బ్రేక్ ఫాస్ట్, మీల్స్, రాత్రి భోజనానికి పూర్తి ఏర్పాట్లు చేస్తారు.
ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా హోటళ్లలో వసతి కల్పిస్తారు.

ప్యాకేజీలో లభించే సౌకర్యాలివే :
ఇందులో షేరింగ్ ఆప్షన్ ఉంది. ఏసీ కోచ్‌లలో టూర్ ప్లాన్ ప్రకారం మీ సందర్శనా స్థలాలను ఎంచుకోవచ్చు.

  • ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్)
  • ప్రయాణ సమయంలో ఐర్‌సీటీసీ ఎస్కార్ట్ సర్వీసులు
  • అన్ని సర్వీసులకు ట్యాక్సులు వర్తిస్తాయని గమనించాలి.

ఐర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ ధర ఎంత? :
ప్రయాణ సమయంలో ఛార్జీలు ఇలా ఉంటాయి
ఒక్కొక్కరికి : రూ. 24,485
ఇద్దరు వ్యక్తులలో ఒక్కొక్కరికి : రూ. 20వేలు
ముగ్గురు వ్యక్తుల్లో ఒక్కొక్కరికి : రూ. 19,625

ఎలా బుక్ చేసుకోవాలి? :
మీరు ఈ ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీని పొందవచ్చు. మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com)ని విజిట్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)ని సంప్రదించవచ్చు.

Read Also : iPhone 17 Pro Max Launch : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ డేట్ ఇదేనట.. ఫీచర్లు, డిజైన్, ధర వివరాలివే..!

ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ఎందుకు ఎంచుకోవాలి? :

  • సరసమైన ధరలతో పాటు సురక్షితమైన ప్రయాణం
  • విమానం, హోటల్ సౌకర్యాలు
  • రుచికరమైన ఆహారం అందిస్తారు.
  • స్థానిక ప్రాంతాల్లో సందర్శించేందుకు బస్సు సర్వీసులు