iPhone 17 Pro Max Launch : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ డేట్ ఇదేనట.. ఫీచర్లు, డిజైన్, ధర వివరాలివే..!
iPhone 17 Pro Max Launch : సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌లో డిజైన్ మార్పులతో పాటు పవర్‌ఫుల్ A19 ప్రో చిప్, అప్‌గ్రేడ్ కెమెరాలు ఉండవచ్చు.

iPhone 17 Pro Max Launch
iPhone 17 Pro Max Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏడాది వచ్చే సెప్టెంబర్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రోలతో పాటు ఐఫోన్ 17 ప్రో మాక్స్ కూడా ఆపిల్ ఆవిష్కరించనుంది. అధికారిక ప్రకటనకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, ముందే లీక్‌లు, ఇంటర్నల్ రిపోర్టు బయటపెట్టేశాయి.
ప్రధానంగా ఐఫోన్ డిజైన్ మార్పుతో పాటు ప్రైమరీ కెమెరా, పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌ల వరకు ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే ఐఫోన్ 17ప్రో మ్యాక్స్‌లో ఇంకా ఏయే మార్పులు ఉండనున్నాయి? భారత్ సహా అమెరికా, కెనడా, దుబాయ్ దేశాల్లో ఏయే ధరల్లో ఉండనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్ మార్పులు :
గత ఐఫోన్ ప్రో మోడళ్లలో మాదిరిగా టైటానియం ఫ్రేమ్ ఉండకపోవచ్చు. నివేదికల ప్రకారం.. అల్యూమినియంకు మారే అవకాశం ఉంది. ఇందులో స్పెషల్ పార్ట్-గ్లాస్, పార్ట్-అల్యూమినియం బ్యాక్ ఉండవచ్చు. ఈ డిజైన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సపోర్టు చేసేలా ఉండవచ్చు.
ఐఫోన్ మార్పులలో ప్రధానంగా కెమెరా బంప్ మారవచ్చు. గత మోడళ్లలో స్క్వేర్ ఆకారపు మాడ్యూల్‌కు బదులుగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ అల్యూమినియంతో భారీ రెక్టాంగ్యులర్ కెమెరా బంప్‌ను కలిగి ఉండవచ్చు. లీకైన (CAD) రెండర్‌లు, కాన్సెప్ట్ ఫొటోలు ఆపిల్ ఫ్లాష్, (LiDAR) సెన్సార్ పొజిషనింగ్‌ను కూడా ఎడ్జెస్ట్ చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.
స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. మెరుగైన 3-నానోమీటర్ ప్రాసెస్‌పై ఆపిల్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ అందుతుంది. అదనంగా, ర్యామ్ మెమరీని ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో 8జీబీ నుంచి 12జీబీకి పెంచవచ్చు.
కెమెరాలు (అంచనా) :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 48MP టెలిఫోటో లెన్స్‌తో రానుందని అంచనా. ఇప్పటికే 48MP వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఆపిల్ ప్రో మోడల్స్ ఫస్ట్ టైం మూడు 48MP లెన్స్‌లతో వస్తాయి. ఫ్రంట్ సైడ్ ప్రో మాక్స్ సెల్ఫీలు, ఫేస్ టైమ్ కోసం కొత్త 24MP కెమెరా ఉండవచ్చు.
ఆపిల్ 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. అదేగానీ నిజమైతే వినియోగదారులు ఎయిర్‌పాడ్‌లు లేదా ఆపిల్ వాచ్ వంటి ఐఫోన్లను బ్యాక్ నుంచి నేరుగా ఛార్జ్ చేయొచ్చు. అయితే, వైర్డు ఛార్జింగ్ స్పీడ్ ప్రస్తుత మోడళ్ల మాదిరిగానే 35W వద్ద ఉంటుందని అంచనా.
లాంచ్ తేదీ (అంచనా) :
సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13, 2025 మధ్య ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రోలతో పాటు ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను లాంచ్ చేయొచ్చు.
భారత్‌లో ధర (అంచనా) :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర గత ప్రో మాక్స్ మోడళ్ల మాదిరిగా ఉండవచ్చు.
భారత్ : రూ. 1,44,900
అమెరికా: 1,199 డాలర్లు
దుబాయ్ : 5,099 (AED)
కెనడా: 1,449 (CA) డాలర్లు