Vivo Y300i Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ చూశారా..? ధర, ఫీచర్లు మాత్రం కెవ్వు కేక.. ఓసారి లుక్కేయండి!

Vivo Y300i Launch : వివో నుంచి సరికొత్త Y300i ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ ఎప్పుడు కానుందో కంపెనీ రివీల్ చేసింది. ఫీచర్లు ధర పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

Vivo Y300i Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ చూశారా..? ధర, ఫీచర్లు మాత్రం కెవ్వు కేక.. ఓసారి లుక్కేయండి!

Vivo Y300i launch date announced

Updated On : March 9, 2025 / 6:54 PM IST

Vivo Y300i Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అదే.. (Vivo Y300i) ఈ మోడల్ వివో Y300 సిరీస్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్. గతంలో ఈ వివో ఫోన్ కీలక హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలను చైనీస్ టెలికాం వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది.

కానీ, ఫోన్ లాంచ్ తేదీ గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వివో అధికారికంగా వివో Y300i లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ కొత్త వివో ఫోన్ ఇంకా ఏయే ఫీచర్లతో రాబోతుంది? భారత మార్కెట్లో లాంచ్ అవుతుందా? లేదా ఇలా మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Vivo V50e Launch : అద్భుతమైన ఫీచర్లతో వివో కొత్త V50e వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే? ధర, స్పెషిఫికేషన్లు.. ఫుల్ డిటెయిల్స్..!

వివో Y300i లాంచ్ తేదీ :
వివో అధికారిక (Weibo) అకౌంట్ ప్రకారం.. వివో Y300i మార్చి 14న చైనాలో లాంచ్ కానుంది. రాబోయే ఈ వివో ఫోన్ ‘ఆల్ రౌండ్ యాంటీ-ఫాల్ డైమండ్ షీల్డ్ గ్లాస్’తో పాటు ‘లాంగ్ బ్యాటరీ లైఫ్’ కూడా ఉండవచ్చు.

వివో Y300i స్పెసిఫికేషన్లు :
వివో వై300i హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు చాలా వరకు ఇప్పటికే చైనీస్ టెలికాం వెబ్‌సైట్‌లో జాబితా అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిజైన్ : వివో Y300i సర్కిల్ కెమెరా హౌసింగ్‌తో ఫ్లాట్ ఫ్రేమ్‌, రింగ్ ఫ్లాష్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌తో వస్తుంది. ఇంక్ జాడే బ్లాక్, రైమ్ బ్లూ, టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే : వివో Y300i ఫోన్ 6.68-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ముందున్న వివో వై200ఐ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంది.

ప్రాసెసర్ : SM4450 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీకి సపోర్టు చేస్తుంది. ముఖ్యంగా, గత మోడల్ కూడా ఇదే చిప్‌సెట్‌తో వచ్చింది.

స్టోరేజీ : మొత్తం 3 వేరియంట్లు..

8GB ర్యామ్ + 256GB స్టోరేజీ
12GB ర్యామ్ + 256GB స్టోరేజీ
12GB ర్యామ్ + 512GB స్టోరేజీ

కెమెరా :
డ్యూయల్-కెమెరా సెటప్, సెకండరీ సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో రానుంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీతో రానుంది. 44W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : AC Prices Hike : బిగ్ అలర్ట్.. ఏసీల రేట్లు భారీగా పెరగబోతున్నాయ్.. ఇప్పుడే కొని ఇంటికి తెచ్చుకోండి..!

ధర వివరాలు (అంచనా) :

8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ : CNY 1,499 (సుమారు రూ.18వేలు)
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ : CNY 1,699 (సుమారు రూ. 20,500)
12GB ర్యామ్ + 512GB స్టోరేజ్: CNY 1,799 (సుమారు రూ. 21,500)

వివో Y200i భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు. వివో Y300i లాంచ్ ఇప్పట్లో లేనట్టే..