AC Prices Hike : బిగ్ అలర్ట్.. ఏసీల రేట్లు భారీగా పెరగబోతున్నాయ్.. ఇప్పుడే కొని ఇంటికి తెచ్చుకోండి..!
AC Prices Hike : ఏసీలు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. వేసవికి ముందే ఏసీల కొరత కారణంగా ధరలు అమాంతం పెరగనున్నాయి.

Air Conditioner Crisis
AC Prices Hike : బాబోయ్.. సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మొదలయ్యాయి. ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న నెలల్లో మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూలింగ్ కోసం వినియోగదారులు ఏసీలు, కూలర్లు కొనేందుకు పరుగులు పెడుతున్నారు.
మార్కెట్లో ఏసీలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. రానురాను మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత మార్కెట్లో ఎయిర్ కండిషనర్ల (AC) కొరత తీవ్రంగా ఉండవచ్చు. దేశవ్యాప్తంగా ఏసీల స్టాక్ అయిపోయే అవకాశం ఉందని నివేదికలు సైతం సూచిస్తున్నాయి. ఏసీల ధరలు పెరిగే లోపు నచ్చిన ఏసీ, కూలర్లను కొనితెచ్చుకోవడం మంచిది. ఇంతకీ, ఏసీల కొరతకు అసలు కారణాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏసీల కొరతకు కారణాలివే :
ఏసీల తయారీదారులు సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌లో కంప్రెసర్ కొరత ఏర్పడనుంది. అది కాస్తా వాటి ఉత్పత్తిపై భారీ ప్రభావాన్ని చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా కంప్రెసర్ తయారీ మందగించవచ్చు.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏసీల లభ్యత తగ్గవచ్చు. ఇంకా ఏసీల డిమాండ్ అంచనాలను మించిపోతే మాత్రం రిటైలర్ల వద్ద స్టాక్ త్వరగా అయిపోతుందని పరిశ్రమ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ సీజన్ చివరిలో ఏసీలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసే వారికి లిమిటెడ్ ఆప్షన్లు, తక్కువ సరఫరాతో ఏసీల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
పీక్ సీజన్ ముందే ఏసీ స్టాక్స్ ర్యాలీ :
వేసవి కాలం ఇప్పుడే మొదలవుతోంది. ఇంతలోనే ఏసీ సెక్టార్ స్టాక్‌లు దూసుకుపోతున్నాయి. ఏసీల అమ్మకాలు పెరగడం వల్ల సరఫరా కొరత ఏర్పడే అవకాశం ఉంది. బ్లూ స్టార్ షేర్లు ఇటీవల దాదాపు 9శాతం వరకు పెరిగి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం, ఈ స్టాక్ 0.67శాతం తగ్గి రూ.2,086 వద్ద ట్రేడవుతోంది.
గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో 11శాతం వద్ద లాభపడింది. వోల్టాస్ షేర్లు సైతం మొదట్లోనే భారీ పెరుగదలను చవిచూశాయి. ఆపై స్వల్పంగా వెనక్కి తగ్గాయి. ప్రస్తుతానికి, ఈ స్టాక్ 0.57శాతం తగ్గి రూ.1,401 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతానికి స్వల్పంగా తగ్గినప్పుటికీ ఏసీలు స్టాక్‌లు సమ్మర్ డిమాండ్ కారణంగా గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్‌లో ఏసీల అమ్మకాలు పెరుగుతాయా? :
ప్రతి ఏడాదిలానే సమ్మర్ సీజన్‌లో ఎయిర్ కండిషనర్లు, కూలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. గత ఏడాదిలో ఏసీ, కూలర్లు వంటి కూలింగ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది కూడా ధరలు అలానే ఉంటాయని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఏసీల అమ్మకాలు 25 శాతం నుంచి 30శాతం పెరుగుతాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 2025లో వేసవి కాలం అత్యంత వేడిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతలు మొదలయ్యాయి. ఎండలను తట్టుకునేందుకు వినియోగదారులు ఇప్పటికే ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసేందకు మార్కెట్ బాట పడుతున్నారు.
ఏసీల ధరలు, ఇన్వెంటరీపై ప్రభావం :
ఏసీల సరఫరా తగ్గింది. దాంతో మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. పరిమిత స్టాక్ కారణంగా భారత మార్కెట్లో ఏసీల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ప్రముఖ మోడల్స్ బ్రాండ్ల ఏసీలపైనే ఎక్కువగా ప్రభావం ఉండవచ్చు.
వినియోగదారులు ఆర్డర్ చేసిన ఏసీల డెలివరీలలో కూడా బాగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ డిమాండ్ పెరుగుదలతో డీలర్లు, రిటైలర్లు ఇన్వెంటరీ కొరతను ఎదుర్కోవలసి రావచ్చు. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడవచ్చు.