Vivo V50e Launch : అద్భుతమైన ఫీచర్లతో వివో కొత్త V50e వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే? ధర, స్పెషిఫికేషన్లు.. ఫుల్ డిటెయిల్స్..!
Vivo V50e Launch : కొత్త వివో V50e ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో లాంచ్‌కు ముందే ఈ వివో ఫోన్ ఫీచర్లు, ధర, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలు ఇవే

Vivo V50e India launch timeline
Vivo V50e Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. పాత వివో V40e ఫోన్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వివో V50e లాంచ్ కానుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
ఈ ఫోన్ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైంది. గత నెలలో మార్కెట్లో లాంచ్ అయిన వివో V50 ఫోన్ కన్నా అత్యంత చౌకైన ఫోన్ అని చెప్పవచ్చు. కొత్త నివేదిక ప్రకారం.. భారత మార్కెట్లో వివో V50e లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధరల రేంజ్ వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Read Also : Google Pixel 8 Sale : రూ. 83వేల ఫోన్ కేవలం రూ.30వేలకే.. గూగుల్ పిక్సెల్ 8పై హోలీ డిస్కౌంట్..
వివో V50e ఇండియా లాంచ్ (లీక్) :
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. వివో V50e వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించలేదు. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ ఫోన్ సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుందని నివేదిక పేర్కొంది.
వివో V50e స్పెసిఫికేషన్లు (లీక్) :
డిస్‌ప్లే : వివో V50e ఫోన్ 6.77-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. వివో V40e మాదిరిగానే స్క్రీన్ సైజుతో రావచ్చు.
ప్రాసెసర్ : ఈ ఫోన్ వివో V40e మాదిరిగానే మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.
మెమరీ : చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో రావచ్చు.
కెమెరాలు : వివో V50e ఫోన్ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు.
సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉండవచ్చు. వివో V40e మాదిరిగానే ఉండొచ్చు.
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) : ఆండ్రాయిడ్ 15 ఆధారిత (FuntouchOS 15) కస్టమ్ స్కిన్ కలిగి ఉంటుంది.
బ్యాటరీ : ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,600mAh బ్యాటరీతో రానుంది. వివో V40e ఫోన్ 5,500mAh సెల్, 80W ఛార్జింగ్ స్పీడ్ కన్నా కొంచెం అప్‌గ్రేడ్ ఉండొచ్చు.
ఇతర ఫీచర్లు : వివో V50e ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ68/ఐపీ69 రేటింగ్‌తో రావచ్చు.
వివో V50e ధర విషయానికొస్తే.. భారత మార్కెట్లో రూ.25వేల నుంచి రూ.30వేల మధ్య ఉండవచ్చు.. గతంలో వివో V40e బేస్ మోడల్ రూ.28,999 వద్ద లాంచ్ అయింది.