WhatsApp AI : వాట్సాప్ యూజర్లకు పండగే.. కొత్త ఏఐ ఫీచర్ భలే ఉందిగా.. మీ గ్రూపులో నచ్చిన ఫొటోలు క్రియేట్ చేయొచ్చు!

WhatsApp AI : వాట్సాప్‌‌లో అద్భుతమైన ఏఐ ఫీచర్ వస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకసారి అందుబాటులోకి వచ్చాక యూజర్లందరూ మీ గ్రూపులో నచ్చిన విధంగా ప్రొఫైల్ ఫొటోలను ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు.

WhatsApp AI : వాట్సాప్ యూజర్లకు పండగే.. కొత్త ఏఐ ఫీచర్ భలే ఉందిగా.. మీ గ్రూపులో నచ్చిన ఫొటోలు క్రియేట్ చేయొచ్చు!

WhatsApp Beta

Updated On : March 9, 2025 / 5:40 PM IST

WhatsApp AI : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మెటా సొంత యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెడుతూనే ఉంది. వినియోగదారుల కోసం వాట్సాప్ ఇప్పటికే మెటా ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఇదో ఏఐ చాట్‌బాట్. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఏ అంశంపైనైనా ఈజీగా సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు కంపెనీ మరో సరికొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారి గ్రూపులోని ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ఇంతకీ ఈ ఏఐ ఫీచర్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 Pro : వావ్ వండర్‌‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

వాట్సాప్ బీటా వెర్షన్లలో రెండు కొత్త ఏఐ ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. ఏఐ చాట్ సర్వీస్ కోసం కొత్త విడ్జెట్‌ చేర్చింది. వినియోగదారులు యాప్‌ను ఓపెన్ చేయకుండానే మెటా ఏఐ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయొచ్చు.

ఇప్పటికే, ఏఐ-జనరేటెడ్ గ్రూప్ ఐకాన్ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. వినియోగదారులు ప్రాంప్ట్‌లను ఉపయోగించి గ్రూప్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇందుకోసం యూజర్లు మెటా ఏఐని వాడొచ్చు. ఈ ఏఐ ఫీచర్లు iOS, ఆండ్రాయిడ్ వాట్సాప్‌ యూజర్లందరికి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

వాట్సాప్ బీటాలో కొత్త ఏఐ ఫీచర్ :
ఆండ్రాయిడ్ 2.25.6.10 కోసం వాట్సాప్ బీటాకు అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత (Ask Meta AI) బటన్‌ కనిపిస్తుంది. అయితే, కొంతమంది బీటా టెస్టర్లు మెటా ఏఐతో ఫొటోలను క్రియేట్ చేసే కొత్త ఆప్షన్ చూస్తారు. గ్రూపులో ప్రస్తుత ఐకాన్‌పై కనిపించే పెన్సిల్ బటన్ ట్యాప్ చేసి తర్వాత వినియోగదారులకు (Create AI Image) అనే 5వ ఆప్షన్ చూడవచ్చు.

క్రియేట్ ఏఐ ఇమేజ్‌పై ట్యాప్ చేసిన తర్వాత యూజర్లు మెటా ఏఐ ప్రాంప్ట్ స్క్రీన్‌ను చూస్తారు. బీటా టెస్టర్లు ప్రాంప్ట్‌ను ఎంటర్ చేసి చాట్‌బాట్ మల్టీ ఫొటోలను రూపొందించే వరకు వేచి ఉండాలి. కొత్త గ్రూప్ ఐకాన్‌ను ఎంచుకోవడానికి ఆప్షన్ల ద్వారా స్వైప్ చేయవచ్చు.

(Ask Meta AI) బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా వినియోగదారులు వాట్సాప్‌లోని మెటా ఏఐ చాట్‌బాట్‌తో చాట్‌కు రీడైరెక్ట్ అవుతారు. యూజర్లు అడిగే ప్రశ్నను టైప్ చేయవచ్చు లేదా ఫొటో ఆధారిత లేదా ఆడియో ప్రాంప్ట్‌ల కోసం కెమెరా, వాయిస్ బటన్‌లను ఉపయోగించవచ్చు. కొత్త విడ్జెట్ అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే వరకు స్టేబుల్ ఛానెల్‌లోని యూజర్లు వాట్సాప్‌ను ఓపెన్ చేసి మెటా ఏఐ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయొచ్చు. మెటా ఏఐ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ (FAB)ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

గ్రూప్‌ల కోసం ఏఐ పవర్డ్ ప్రొఫైల్ ఫోటోలు :
ఇటీవలి (WABeta) రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త ఏఐ-పవర్డ్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. వినియోగదారులు గ్రూప్ చాట్‌ల కోసం ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. గతంలో వాట్సాప్ కూడా పర్సనల్ ప్రొఫైల్ ఫొటోను క్రియేట్ చేసేందుకు ఇలాంటి ఫీచర్‌ను తీసుకురానుందని నివేదికలు పేర్కొన్నాయి. కానీ, ప్రస్తుతం ఈ ఫీచర్ పర్సనల్ ప్రొఫైల్ పిక్చర్‌కు అందుబాటులో లేదని గమనించాలి.

ఎవరికి బెనిఫిట్స్ అంటే? :
వాట్సాప్‌లోని మెటా ఏఐ ఫీచర్‌ని ఉపయోగించి యూజర్లు ఏఐ సాయంతో ప్రత్యేకమైన లేదా కస్టమైజడ్ గ్రూప్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌లో సరైన ప్రొఫైల్ ఇమేజ్ లేని అకౌంట్లలో ఏఐ ద్వారా సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫొటో కోసం సెర్చ్ చేయాల్సిన పనిలేదు.

Read Also : Google Pixel 8 Sale : రూ. 83వేల ఫోన్ కేవలం రూ.30వేలకే.. గూగుల్ పిక్సెల్ 8పై హోలీ డిస్కౌంట్..

మీ కెమెరాతో కొత్త ఫోటో తీయనక్కర్లేదు. వాట్సాప్ యూజర్లు సింపుల్‌గా మీకు ఎలాంటి ఫొటో కావాలో ఇన్ఫో ఇస్తే చాలు.. మెటా ఏఐ యూజర్ల గ్రూప్ కోసం అద్భుతమైన ఏఐ ఫొటోను క్రియేట్ చేసి ఇస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ స్టేబుల్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఈ యూజర్లు ఈ ఏఐ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇదే విషయాన్ని వాట్సాప్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇదో అద్భుతమైన ఏఐ ఫీచర్ అని చెప్పవచ్చు. ఏఐ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా గ్రూప్ ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు.