iPhone 15 Series : ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త 48MP రిజల్యూషన్ ఫొటోలను తీయొచ్చు.. ఎలా వాడాలంటే? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!

iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో కొత్త కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొత్త ఐఫోన్ మోడళ్లలో 48MP ఫుల్ రిజల్యూషన్‌ను ఫొటోలను క్యాప్చర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Tech Tips in Telugu _ How to use 48MP resolution on iPhone 15 series

iPhone 15 Series : ఆపిల్ (Apple) లేటెస్ట్ జనరేషన్ iPhones, iPhone 15 సిరీస్, కొత్త 48MP ప్రైమరీ సెన్సార్‌తో వస్తాయి. ఆపిల్ ఐఫోన్ మోడల్‌లతో అందించే గత జనరేషన్ 12MP సెన్సార్ కన్నా భారీ అప్‌గ్రేడ్‌గా వస్తుంది. అయితే, అతిపెద్ద బెనిఫిట్ ఏమిటంటే.. (Android OEM)లు అందించే 12MPకి బదులుగా డిఫాల్ట్ 24MP రిజల్యూషన్ పొందవచ్చు. కొత్త ఐఫోన్ మోడళ్లలో కొత్త 48MP ఫుల్ రిజల్యూషన్‌ను ఫొటోలను క్యాప్చర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఫుల్ 48MP రిజల్యూషన్‌లో ఫొటోలను ఎలా క్యాప్చర్ చేయాలో ఈ టెక్ టిప్స్ (Tech Tips in Telugu) ఇప్పుడు చూద్దాం..

Read Also : iPhone 13 Users : ఐఫోన్ 13 యూజర్లకు ఆపిల్ మాజీ ఉద్యోగి వార్నింగ్.. iOS 17 అప్‌డేట్ అసలు డౌన్‌లోడ్ చేసుకోవద్దు..!

ముందస్తు అవసరాలు (Pre-requisites) :
iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఈ ఫీచర్‌కు సపోర్టు ఇచ్చే ఫోన్‌లు కాగా.. iPhone 14 Pro, iPhone 14 Pro Max యూజర్లు 48MP రిజల్యూషన్‌తో కూడా షూట్ చేయవచ్చు. iPhone 15, iPhone 15 Plus JPEG Max (48MP) ఫొటోలకు సపోర్టు ఇస్తుంది. అయితే, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ 48MP JPEG, HEIF Max 48MP, ProRAW ఫొటోలు రెండింటినీ సపోర్ట్ చేస్తాయి.

కొత్త ఐఫోన్లలో 48MPలో ఫొటోలు క్యాప్చర్ చేస్తే :
అన్నిటికంటే ముందుగా, ఫొటో సైజులో 48MP రిజల్యూషన్‌లో సాపేక్షంగా పెద్దదిగా ఉంటుంది. ఒక్కో ఫొటోకు దాదాపు 100MB పరిధిలో ఉంటుంది. ఈ రిజల్యూషన్‌లోని అన్ని ఫొటోలను క్యాప్చర్ చేయకుండా చూసుకోండి. HEIF 48MP మోడ్ ఉంది. 5MB లోపు 48MPలో ఫొటోలను క్లిక్ చేస్తుంది. అనుకూలత సమస్యలు ఉన్నందున ఈ ఫార్మాట్‌లో అన్ని సమయాలలో ఫొటోలను క్యాప్చర్ చేయకూడదు.

iPhone 15 series

iPhone 15 సిరీస్‌లో 48MP మోడ్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :
* మీ iPhone 15 సిరీస్ లేదా iPhone 14 Pro మోడల్‌లలో Settings యాప్‌ను ఓపెన్ చేయండి.
* కెమెరా ఆప్షన్ నావిగేట్ చేసి.. ఫార్మాట్‌ల ఆప్షన్ ఎంచుకోండి
* ఇప్పుడు, ProRAW & రిజల్యూషన్ కంట్రోల్ ఆప్షన్‌పై టోగుల్ చేయండి (iPhone 15, iPhone 15 Plus మాత్రమే ఆప్షన్)
* iPhone 14 Pro/ Pro Max, iPhone 15 Pro, Pro Maxలో HEIFని ఎంచుకోండి లేదా మీకు ProRAW Max ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది.

కెమెరా యాప్‌ని ఓపెన్ చేసి.. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న కెమెరా యాప్‌లో మీకు HEIF Mac లేదా RAW Max ఆప్షన్ కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. మీరు ఆప్షన్ చూసినట్లయితే, షట్టర్ బటన్‌ను Tap చేయండి.

Read Also : Apple iPhones Discount Sale : అసలే పండుగ సీజన్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు