Apple iPhones Discount Sale : అసలే పండుగ సీజన్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 13 And iPhone 14 available discounts on both Amazon And Flipkart in Telugu
Apple iPhones Discount Sale : పండుగల సీజన్ దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ద దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దీపావళి విక్రయాలలో (Diwali Sales) భాగంగా అనేక గాడ్జెట్లపై ఆకట్టుకునే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) రెండూ అక్టోబర్ 8న ప్రారంభమయ్యాయి.
ఈ సేల్‌లో భాగంగా, ఆపిల్ (iPhone 13), అలాగే ఆపిల్ (iPhone 14) ఫోన్లపై రెండు ప్లాట్‌ఫారమ్‌లపై తగ్గింపుపై అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ 2 ఐఫోన్లలో అందిస్తున్న ధర చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇష్టపడే ఫోన్‌ని సొంతం చేసుకోవడానికి ఏ ప్లాట్‌ఫారమ్ బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 సేల్.. :
ఆపిల్ ఐఫోన్ 13 విషయానికి వస్తే.. ఐఫోన్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వాస్తవానికి రూ. 59,900గా ఉంది. అయితే ఈ ఐఫోన్‌ను అమెజాన్‌లో రూ.48,999కి విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 13 మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 51,999. అయితే, 128 GB వేరియంట్ ప్రస్తుతం వెబ్సైట్లో స్టాక్‌లో లేదు. అందువల్ల, ఐఫోన్ 13, 128GB వేరియంట్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఐఫోన్ ధర తక్కువకే అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 సేల్ :
ఐఫోన్ 14 విషయానికి వస్తే.. ఐఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ వాస్తవానికి రూ.69,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఐఫోన్ ధర రూ.56,999కి తగ్గింది. అంతేకాదు.. మీరు వివిధ బ్యాంక్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

Apple iPhone 13 And iPhone 14 discounts
ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 ఏది కొనాలి? :
మీలో కొందరు ఏ ఐఫోన్ మోడల్ కొంటే బెటర్ అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఐఫోన్ 13, iPhone 14 మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అయితే, మీరు కొంచెం లోతుగా పరిశీలిస్తే.. రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రాసెసర్ పరంగా iPhone 14 A15 బయోనిక్ చిప్‌లో అదనపు GPU కోర్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ రోజువారీ వాడకంలో ఎలాంటి సమస్యలు ఉండవు.. హై గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అవసరమయ్యే పనుల్లో కొంచెం తేడాలు కనిపించవచ్చు.
A16 బయోనిక్ చిప్ (iPhone 14 Pro), (iPhone 14 Pro Max) మోడళ్లకు ప్రత్యేకమైనది. ఐఫోన్ 14 కెమెరా బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్‌ను అందిస్తుంది. తక్కువ-కాంతి ఫొటోగ్రఫీ పరంగా కొన్ని మెరుగుదలలను కూడా అందిస్తుంది. అయితే, సరైన కాంతి పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ (iPhone 13), iPhone 14తో సమానంగా ఉంటుంది.
ఐఫోన్ కెమెరా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. రెండు ఐఫోన్లు 12MP కెమెరాలతో ఉన్నాయి. రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. ఐఫోన్ 13 AE/2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 AE/1.9 ఎపర్చరును కలిగి ఉంది. కొత్త ఫోన్‌కు మరింత కాంతిని అందిస్తుంది. ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరాలో మొదటిసారిగా ఆటో-ఫోకస్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. అందువల్ల, ఐఫోన్ 14 తక్కువ-కాంతి పరిస్థితులలో మెరుగైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. కానీ పగటి వెలుగులో రెండు ఫోన్ల నుంచి తీసిన ఫొటోలలో ఎలాంటి తేడాలు కనిపించవు.