Samsung Galaxy A34 Price Drop : శాంసంగ్ గెలాక్సీ A34 5G ధర తగ్గిందోచ్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 4 కారణాలివే..!

Samsung Galaxy A34 Price Drop : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A34 ధర భారీ తగ్గింపును పొందింది. ఈ డివైజ్ భారత్‌లో రూ. 30,999 ప్రారంభ ధరతో వచ్చింది. (Samsung Galaxy A34 5G) ధర రూ. 27,999కి పడిపోయింది.

Samsung Galaxy A34 Price Drop : శాంసంగ్ గెలాక్సీ A34 5G ధర తగ్గిందోచ్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 4 కారణాలివే..!

Samsung Galaxy A34 price drops, effectively available at Rs 25,999 on Flipkart

Samsung Galaxy A34 Price Drop : కొత్త ఫోన్ కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం శాంసంగ్ యూజర్లు అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ భారత మార్కెట్లో రూ. 30,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ధర రూ. 27,999కి పడిపోయింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2వేల తగ్గింపు అంటే.. శాంసంగ్ ఫోన్ ధర రూ. 25,999కి తగ్గింది. అయితే, 5G ఫోన్ కొనడానికి విలువైనదేనా? శాంసంగ్ గెలాక్సీ A34 5Gని కొనుగోలు చేయడానికి 4 కారణాలు ఏంటో ఓసారి చూద్దాం..

Read Also : iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర, స్పెషిఫికేషన్లు ఇవే..

శాంసంగ్ గెలాక్సీ A34 కొనుగోలుకు 4 కారణాలివే :
శాంసంగ్ (Samsung Galaxy A34) బెస్ట్ 5G ఫోన్.. MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. డివైజ్ కాలింగ్, మెసేజింగ్, మల్టీ టాస్కింగ్ వంటి ప్రాథమిక అంశాలను సులభంగా నిర్వహించగలదు. సాధారణ గేమ్‌లకు పర్వాలేదు. అయితే, జెన్‌షిన్ ఇంపాక్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ గ్రాఫికల్ డిమాండ్ ఉన్న గేమ్‌లను ఆడితే పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు. ఈ గేమ్‌లను తక్కువ గ్రాఫిక్స్ సెట్టింగ్‌లలో ఆడటమే మంచిది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్‌లను కూడా ఉన్నాయి.

Samsung Galaxy A34 price drops, effectively available at Rs 25,999 on Flipkart

Samsung Galaxy A34 Price Drop on Flipkart

గెలాక్సీ A34 అనేది ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్.. :
మీకు మంచి ఫోన్ కావాలంటే.. శాంసంగ్ గెలాక్సీ A34 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. IP67 ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్‌తో వస్తుంది. డివైజ్ క్వాలిటీ బాగుంది. 5G ఫోన్ 1 మీటర్ నీటిలో 30 నిమిషాల పాటు మునిగినా ఫోన్ కొంచెం కూడా చెక్కు చెదరదు. వర్షాకాలంలో ఫోన్‌ని ఉపయోగించినా ఎలాంటి సమస్య ఉండదు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ A34 అనేది ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్.. ఎందుకంటే ఈ ఫోన్ Android 17 OS వరకు అప్‌డేట్స్ పొందుతుంది. ఇతర ఫోన్‌లతో ఈ ఫీచర్‌లను పొందలేరు.

పెద్ద బ్యాటరీ.. రోజంతా ఛార్జింగ్ వస్తుంది :
హుడ్ కింద 5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్ చేస్తే ఒక రోజు వరకు ఉంటుంది. పూర్తి ఛార్జింగ్ దిగేవరకు ఉండకుండా చివరిలో ఛార్జ్ చేయాలి. కానీ, యూజర్ వాడకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. డిస్‌ప్లే కూడా చాలా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేకు సపోర్టు వస్తుంది. రంగులు బాగా కనిపిస్తాయి. అదనంగా, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 మాదిరిగానే డిజైన్‌ను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A34 ఎందుకు కొనవద్దు? :
కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టును అందించింది. అయితే, శాంసంగ్ ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించడం లేదు. ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. వినియోగదారులు తమ ఇళ్లలో అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర పాత ఛార్జర్‌ని ఎంచుకోవచ్చు. మీకు దీనితో సమస్య లేకపోతే, శాంసంగ్ గెలాక్సీ A34ని కొనుగోలు చేయవచ్చు.

Read Also : Samsung Galaxy S23 FE : ఇది కదా ఫోన్ అంటే.. శాంసంగ్ లవర్స్ కోసం గెలాక్సీ S23 FE 5G ఫోన్.. సేల్ ఆఫర్లు, టాప్ ఫీచర్లు ఇవే..!