Samsung Galaxy S23 FE : ఇది కదా ఫోన్ అంటే.. శాంసంగ్ లవర్స్ కోసం గెలాక్సీ S23 FE 5G ఫోన్.. సేల్ ఆఫర్లు, టాప్ ఫీచర్లు ఇవే..!

Samsung Galaxy S23 FE : ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ (Galaxy S23 FE 5G Launch in India) ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ 5G ఫోన్ బ్యాంక్ కార్డ్‌లతో సహా రూ. 49,999 ప్రారంభ ధరకు పొందవచ్చు. సేల్ ఆఫర్లు, స్పెషిఫికేషన్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy S23 FE : ఇది కదా ఫోన్ అంటే.. శాంసంగ్ లవర్స్ కోసం గెలాక్సీ S23 FE 5G ఫోన్.. సేల్ ఆఫర్లు, టాప్ ఫీచర్లు ఇవే..!

Samsung Galaxy S23 FE Launched in India Today, Price And Top Features in Telugu

Samsung Galaxy S23 FE : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి (Samsung Galaxy S22 FE Launch in India) 5G ఫోన్ వచ్చేసింది. గత ఏడాదిలో శాంసంగ్ S22 FE మోడల్‌ను ఆవిష్కరించలేదు. ఈ కొత్త FAN ఎడిషన్ ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లాగ్‌షిప్ Galaxy S23 సిరీస్ టోన్-డౌన్ వెర్షన్. కొత్త శాంసంగ్ ప్రీమియం ఫోన్ ధర రూ. 60వేల లోపు ఉంది. అమెజాన్ (Amazon Sale Offers) ద్వారా విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ సేల్ ఆఫర్‌లు, స్పెషిఫికేషన్లు, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S23 FE భారత్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S23 FE భారత మార్కెట్లో 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 49,999తో వస్తుంది. ఈ డివైజ్ అసలు ధర రూ. 59,999గా ఉంది. అయితే ఈ డివైజ్ ధరరూ. 10వేలు HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.49,999కి తగ్గింది. అమెజాన్ ద్వారా అక్టోబర్ 5 నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయొచ్చు. ప్రారంభ డెలివరీలు అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ మింట్, క్రీమ్, గ్రాఫైట్, పర్పుల్, ఇండిగో టాన్జేరిన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Moto Razr 40 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో రేజర్ 40 మడతబెట్టే ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

శాంసంగ్ గెలాక్సీ S23 FE స్పెసిఫికేషన్‌లు :
కొత్త శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ కాంపాక్ట్ 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్‌కు సాధారణ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. ధర పరిధిలోని చాలా ఆండ్రాయిడ్ఫోన్‌లలో పొందుతుంది. పైభాగంలో హోల్-పంచ్ కటౌట్‌ను చూడవచ్చు. బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఫ్లాగ్‌షిప్ S23 సిరీస్ మాదిరిగా ఉంటుంది.

Samsung Galaxy S23 FE Launched in India Today, Price And Top Features in Telugu

Samsung Galaxy S23 FE Launched in India Today News Telugu

భారత మార్కెట్లో ఈ డివైజ్ ఇతర మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCకి బదులుగా కంపెనీ Exynos 2200 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP టెలిఫోటో కెమెరాతో కూడిన 50MP కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ల 10MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.

నో ఛార్జర్.. 30 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ : 
ప్రీమియం 5G ఫోన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తుంది. హుడ్ కింద 4,500mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది. అనేక స్మార్ట్‌ఫోన్‌లు కనీసం 80Wతో వస్తాయి. శాంసంగ్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు.

ఎందుకంటే కంపెనీ చాలా ఫోన్‌లతో ఛార్జర్‌ను అందించడం ఆపివేసింది. 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఫోన్‌ను ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. Wi-Fi, GPS, NFC, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.

Read Also : Vivo V29 Series Launch : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. వివో V29 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

For More WebStories :Click Here