Vivo V29 Series Launch : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. వివో V29 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

Vivo V29 Series Launch : భారత మార్కెట్లో వివో V29, వివో Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. కొత్త వివో V29 ఫోన్ల ధర ఎంత ఉంటుంది? వివో V29 సిరీస్ టాప్ స్పెషిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Vivo V29 Series Launch : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. వివో V29 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

Vivo V29 Series Launched in India : Top specifications, price in Telugu

Vivo V29 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వివో (Vivo India) భారత మార్కెట్లో వివో V29, వివో V29 ప్రో (Vivo V29, Vivo 29 Pro)లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు హై-ఎండ్ స్పెషిఫికేషన్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చాయి. వివో V29 ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే, వివో V29 ప్రో భారత మార్కెట్లో ప్రత్యేకంగా (Vivo V29 Series Launch in India) లాంచ్ అయింది. ఈ వివో ఫోన్లు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, సొగసైన డిజైన్, కెమెరా పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి.

V29, V29 Pro మిడ్ రేంజ్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూసే యూజర్లకు అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ వివో V29 సిరీస్ ఫోన్లు హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో ఎంపికలలో వస్తుంది. మరోవైపు, V29 ప్రోలో హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మీరు కొత్తగా లాంచ్ అయిన V29 సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే.. టాప్ స్పెక్స్, ఫీచర్లు, ధరలను ఓసారి లుక్కేయండి.

వివో V29, వివో V29 ప్రో : టాప్ స్పెషిఫికేషన్లు :

డిజైన్ : వివో V29, వివో ప్రో రెండూ సొగసైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లు ప్రీమియం డిజైన్, కర్వడ్ స్క్రీన్‌తో వస్తాయి. వెనుకవైపు, 3 కెమెరా లెన్స్‌లు, LED ఫ్లాష్, స్మార్ట్ ఆరా లైట్‌తో కూడిన కెమెరా మాడ్యూల్ ఉంది. రెండు ఫోన్‌ల దిగువ అంచున టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సిమ్ ట్రే, స్పీకర్‌లు ఉన్నాయి. రైట్ ఎడ్జ్ పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది. V29 ఫోన్ బరువు 186 గ్రాములు కాగా, వివో ప్రో బరువు 188 గ్రాములు ఉంటుంది.

Read Also : Vivo T2 Pro Launch : ఈ ఫోన్ భలే ఉంది బ్రో.. వివో T2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

డిస్‌ప్లే : ఈ రెండు ఫోన్‌లు 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR 10+ సర్టిఫికేషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. గరిష్ట ప్రకాశంతో 1300 నిట్‌లు, పిక్సెల్ సాంద్రత 452 PPI ఉంటుంది.

Vivo V29 Series Launched in India _ Top specifications, price And All details in TeluguVivo V29 Series Launched in India _ Top specifications, price And All details in Telugu

Vivo V29 Series Launched in India Telugu

ప్రాసెసర్ : వివో V29 Qualcomm Snapdragon 778G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అయితే, వివో V29 ప్రో మోడల్ MediaTek Dimensity 8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా : ఈ 2 ఫోన్‌లు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. వివో V29 8MP వైడ్ యాంగిల్ షూటర్, 2MP బోకె లెన్స్‌తో OISతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. వివో V29 ప్రో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP పోర్ట్రెయిట్ లెన్స్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్‌లలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ : వివో 2 ఫోన్లలో 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 4600 mAh (TYP) బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఈ ఫోన్ కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 50కి చేరుకోవచ్చని వివో కంపెనీ పేర్కొంది.

వివో V29, వివో V29 టాప్ ఫీచర్లు :

స్మార్ట్ ఆరా లైట్ : వివో V29 సిరీస్‌తో వివో స్మార్ట్ ఆరా లైట్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ లైటింగ్ పరిస్థితుల్లో కెమెరా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. స్మార్ట్ ఆరా లైట్ వెచ్చని కాంతిలో ఉంచినప్పుడు వెచ్చగా మారుతుంది. చల్లని కాంతిలో దాదాపు తెల్లటి రంగులో కూల్‌గా మారుతుంది.

3D పార్టికల్ డిజైన్ : వివో V29 ప్రో హిమాలయన్ బ్లూ కలర్ బ్యాక్ ప్యానెల్‌లో తేలియాడే మౌంటైన్ షేప్ ప్రత్యేకమైన 3D పార్టికల్ డిజైన్‌తో వస్తుంది. మరోవైపు, V29 మోడల్ రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది.

Vivo V29 Series Launched in India

Vivo V29 Series Top specifications Telugu

వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్ : V29 సిరీస్‌తో, వివో భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫిల్టర్‌ (వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్)ను కలిగి ఉంది. ఈ ఫిల్టర్ 3 విభిన్న కలర్ స్కీమ్ ఆప్షన్లను కలిగి ఉంది.

వివో V29, వివో V29 ప్రో లాంచ్ ధర ఎంతంటే? :
వివో V29 సిరీస్ మొత్తం 8GB + 128GB వేరియంట్, 12GB + 256GB అనే 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999 కాగా, 256 స్టోరేజ్ వేరియంట్ రూ.36,999కి లభిస్తుంది. మరోవైపు, వివో V29 ప్రో 8GB + 256GB స్టోరేజీ ఆప్షన్, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. 512GB వేరియంట్ లేదు. 8GB RAM వేరియంట్ ధర రూ. 39,999 కాగా, 12GB ర్యామ్ వేరియంట్ రూ. 42,999కి లభిస్తుంది.

వివో V29 సిరీస్ సేల్ ఎప్పుడంటే? :
వివో V29 సిరీస్ 2 ఫోన్‌లు ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. (Vivo V29 Pro) సిరీస్ అక్టోబర్ 10న అమ్మకానికి వస్తుంది. వివో V29 అక్టోబర్ 17 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లు వివో అధికారిక వెబ్‌సైట్, (Flipkart Sale)లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఇతర స్టోర్‌లో, ఫోన్‌లు ప్రత్యేకమైన వివో స్టోర్‌లతో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

Read Also : Moto Razr 40 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో రేజర్ 40 మడతబెట్టే ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!