Tecno Camon 30S Launch
Tecno Camon 30S Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్ దిగ్గజం టెక్నో నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొత్త కెమన్ 30s ఫోన్ వచ్చేసింది. 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. 8జీబీ వరకు ర్యామ్ మీడియాటెక్ హెలియో జీ100 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ బ్యాక్ కెమెరా, 13ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. టెక్నో కెమన్ 30ఎస్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 33డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 4జీ కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది.
టెక్నో కెమన్ 30S ధర ఎంతంటే? :
టెక్నో కెమన్ 30ఎస్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో టాప్-ఆఫ్-లైన్ మోడల్ పీకేఆర్ 59,999 (దాదాపు రూ. 18,200)గా నిర్ణయించింది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ హ్యాండ్‌సెట్ పాకిస్తాన్‌లో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సెలిస్టల్ బ్లాక్, డాన్ గోల్డ్, నెబ్యులా వైలెట్ కలర్‌వేస్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. టెక్నో కెమన్ 30ఎస్ భారత మార్కెట్లోకి వస్తుందా లేదా అనేదానిపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
టెక్నో కెమన్ 30ఎస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (నానో) టెక్నో కెమన్ 30ఎస్ కంపెనీ హాయ్ఓఎస్ 14 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,436 పిక్సెల్‌లు) కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1,300నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జీ100 చిప్‌సెట్‌తో పాటు 8జీబీ వరకు ర్యామ్‌తో పనిచేస్తుంది.
ఫోటోలు, వీడియోలకు టెక్నో కెమన్ 30ఎస్ 2ఎంపీ కెమెరా డెప్త్ సెన్సార్‌తో పాటు సోనీ ఐఎమ్ఎక్స్896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో హోల్ పంచ్ కెమెరా కటౌట్‌లో 13ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. మీరు టెక్నో కెమన్ 30ఎస్‌లో 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని పొందుతారు.
కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా వస్తుంది. టెక్నో కెమన్ 30ఎస్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్‌ఫ్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ53 రేటింగ్‌ను కలిగి ఉంది.
Read Also : PDF Password : పీడీఎఫ్ ఫైల్ నుంచి పాస్‌వర్డ్‌ను తీసేయడం చాలా ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!