Tecno Spark 50 Pro : ఇది కదా ఫోన్.. 50MP కెమెరాతో టెక్నో స్పార్క్ 50 ప్రో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే!
Tecno Spark 50 Pro : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో టెక్నో నుంచి సరికొత్త స్పార్క్ 50 ప్రో ఫోన్ లాంచ్ అయింది. ఫీచర్లు మాత్రం కిర్రాక్ ఉన్నాయి.. ధర వివరాలివే..
- Sreehari A
- Published on- June 16, 2026 / 08:52 PM IST
Tecno Spark 50 Pro
- టెక్నో స్పార్క్ 50 ప్రోలో 6.78-అంగుళాల HD+ డిస్‌ప్లే సెటప్
- 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా సెటప్
- మీడియాటెక్ డైమెన్సిటీ హీలియో G100 అల్టిమేట్ ప్రాసెసర్
Tecno Spark 50 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి కొత్త టెక్నో స్పార్క్ 50 ప్రో వచ్చేసింది. ఈ టెక్నో ఫోన్ మీడియాటెక్ హీలియో G100 అల్టిమేట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. స్పార్క్ 50 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh, 6,000mAh బ్యాటరీతో వస్తుంది. టెక్నో స్పార్క్ 50 ప్రోకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
టెక్నో స్పార్క్ 50 ప్రో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ 50 ప్రో ధర, అమ్మకాలపై టెక్నో ఇంకా (Tecno Spark 50 Pro) ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంక్ బ్లాక్, టైటానియం గ్రే, మిడ్‌నైట్ బ్లూ, డైనమిక్ ఆరెంజ్ క్లౌడ్ వైట్ రంగులలో లభ్యం కానుంది.
టెక్నో స్పార్క్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
టెక్నో స్పార్క్ 50 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ హీలియో G100 అల్టిమేట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ప్రస్తుతం, ఫోన్ ర్యామ్ లేదా ఇంటర్నల్ స్టోరేజ్ పై ఎలాంటి క్లారిటీ లేదు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై రన్ అవుతుంది. స్పార్క్ 50 ప్రో 5,600mAh లేదా 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
Read Also : E100 vs Petrol : పెట్రోల్ కన్నా ఇథనాల్ చౌకే.. మైలేజీలో ఏది బెటర్? రూ.20 తక్కువ ధర నిజంగా లాభమా?
ఈ రెండు బ్యాటరీలు 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఈ ఫోన్ 30 నిమిషాల్లో 63 శాతం వరకు 55 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని టెక్నో పేర్కొంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.
కెమెరా పరంగా చూస్తే.. టెక్నో స్పార్క్ 50 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంది. ఇందులో DTS సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. స్పార్క్ 50 ప్రోలో కనెక్టివిటీ ఆప్షన్లలో 4.5G సపోర్ట్, 4G, ఫ్రీలింక్ 2.0 ఉన్నాయి.
ఈ టెక్నో ఫోన్ 7.8mm మందంతో వస్తుంది. టెక్నో స్పార్క్ 50 ప్రోలో ఎల్లా ఏఐ ఏజెంట్, ఏఐ హెల్త్ అసిస్టెంట్, ఏఐ రైటింగ్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ ఎక్స్‌టెండర్ వంటి అనేక ఏఐ-ఆధారిత టూల్స్ ఉన్నాయి. ఇందులో లైవ్ ఫోటో ఫంక్షనాలిటీ యూనివర్సల్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.
