Tecno Phantom V Fold 2 5G India Launch
Tecno Phantom V Fold 2 5G : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో టెక్నో నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది. ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోల్డబుల్ మోడల్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, అమోల్డ్ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే, ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13న ముందుగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఫోన్ త్వరలో భారతీయ మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టనుందని నివేదికలు సూచించాయి. గతంలో లాంచ్ అయిన ఫాంటమ్ వి ఫోల్డ్ 5జీకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.
టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 భారత్‌లో లాంచ్ :
మరోవైపు.. టెక్నో మొబైల్ ఇండియా అమెజాన్‌లో పాత మోడల్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 5జీ విక్రయించనున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో భారత మార్కెట్లోకి టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 మరో మోడల్ కూడా వస్తోందని కంపెనీ పేర్కొంది. అయితే, దేశంలో ఈ హ్యాండ్‌సెట్ ధర ఎంత అనేది రివీల్ చేయలేదు. గ్లోబల్ కౌంటర్‌తో సమానమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుందని అంచనా.
టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ గ్లోబల్ వేరియంట్ 1,080×2,550 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో బయటి 6.42-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 7.85-అంగుళాల 2కె+ అమోల్డ్ డిస్‌ప్లే, 2,000 x 2,000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్, 50ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీల కోసం రెండు 32ఎంపీ కెమెరాలు కూడా ఉన్నాయి. టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ 70డబ్ల్యూ అల్ట్రా ఛార్జ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,750mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.3ని కలిగి ఉంది. ఆన్-బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, హాల్ సెన్సార్, ఇ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి.