Tecno Phantom V Fold launched as the cheapest foldable phone in India_ Check price, specs
Tecno Phantom V Fold : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ అనే మోడల్ లాంచ్ చేసింది. ఇతర OEMల నుంచి దేశంలో ఫోల్డబుల్ ఫోన్ లేనందున శాంసంగ్ గెలాక్సీ (Z Fold 4) ఫీచర్లతో వచ్చింది. భారతీయ మార్కెట్‌లో కొన్ని ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లను విక్రయిస్తోంది.
శాంసంగ్ మాత్రమే కాదు.. రెండు 5G ఫోన్‌లు ఎక్కువ లేదా తక్కువ ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ, రెండు డివైజ్‌ల మధ్య ధర కూడా చాలా తేడా ఉంది. భారత మార్కెట్లో ఫాంటమ్ V ఫోల్డ్ ధర రూ. 90వేల కన్నా తక్కువగా ఉంది. దేశంలోనే చౌకైన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్రాండ్ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది.
టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ లాంచ్.. భారత్‌లో ధర ఎంతంటే? :
కొత్త టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో వస్తుంది. ఈ డివైజ్ కేవలం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. స్పెషల్ డిస్కౌంట్ ధర రూ.77,777తో ఏప్రిల్ 12న సేల్ అందుబాటులో ఉంది. HDB బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998తో విక్రయిస్తోంది. రెండు ఫోన్‌ల మధ్య భారీ ధర అంతరం ఉంది.
Read Also : Maruti Suzuki : మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్- బాలెనో కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ఇందులో ఏ కారు బెటర్ అంటే?
అయితే, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లతో యూజర్ అందించే ఫీచర్లను టెక్నో అందించగలదా అనేది చూడాలి. టెక్నో ఫోన్ కొనుగోలుపై రెండేళ్ల వారంటీ, రూ. 5వేల విలువైన ఫ్రీ ట్రాలీ బ్యాగ్, 6 నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ లభిస్తాయి. కస్టమర్‌లు స్టాండ్‌తో ఫ్రీ ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్‌ను కూడా పొందవచ్చు.
Tecno Phantom V Fold launched as the cheapest foldable phone in India
టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
ఫోల్డబుల్ ఫోన్‌లో ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. (Samsung Galaxy Z Fold 4)తో పోల్చితే.. చాలా ఫీచర్లు ఒకే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. చిప్‌సెట్, స్పీడ్ ఛార్జింగ్ టెక్, బ్యాటరీ పరంగా తేడా ఉంది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్ ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది.
లేటెస్ట్ స్టోరేజ్ వెర్షన్ కాదు.. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కనిపించింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్ (Samsung) వంటి ఫోల్డబుల్ ఫోన్ 4,400mAh బ్యాటరీ యూనిట్‌తో 25W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు అందిస్తుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంది. Tecno ఫాంటమ్ V ఫోల్డ్ 6.42-అంగుళాల LTPO ఔటర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ (Samsung) డివైజ్‌లా కాకుండా FHD+ ప్యానెల్. 2296 X 2000 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంది.
స్క్రీన్‌పై కనిపించే కంటెంట్ ఆధారంగా డివైజ్ ఆటోమాటిక్‌గా 10Hz నుంచి 120Hz మధ్య మారవచ్చు. ఈ ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా ఉంది. 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50MP 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. ఈ డివైజ్ బయటి స్క్రీన్‌పై 32-MP కెమెరా ముందు భాగంలో 16MP సెన్సార్ ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.