Maruti Suzuki : మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్- బాలెనో కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ఇందులో ఏ కారు బెటర్ అంటే?

Maruti Suzuki : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లో మారుతి సుజికి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ కార్లు రానున్నాయి. ఇందులో ఏ కారు మోడల్ బెటర్ అంటే?

Maruti Suzuki : మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్- బాలెనో కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ఇందులో ఏ కారు బెటర్ అంటే?

Maruti Suzuki Fronx vs Maruti Suzuki Baleno: Price, specifications compare

Maruti Suzuki : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి భారత మార్కెట్లోకి రెండు కొత్త కార్లను ప్రవేశపెడుతోంది. ముందుగా దేశంలో ఫ్రాంక్స్‌ కారును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV కార్ల తయారీదారు (Nexa) రిటైల్ ఛానెల్ నుంచి సేల్ అందుబాటులో ఉంది. మరో మోడల్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది. ఈ రెండు వాహనాల మధ్య తేడాలు, టెక్నికల్ ఫీచర్ల పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రాంక్స్ vs బాలెనో డైమెన్షన్ ఇవే :
బాలెనో కన్నా ఫ్రాంక్స్ పొడవు, వెడల్పు, పొడవుగా ఉంది. వీల్‌బేస్ అయితే సమానంగా ఉంటుంది. బాలెనో పెద్ద బూట్, తక్కువ టర్నింగ్ రేడియస్‌ని కలిగి ఉంది.

Read Also : Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

ఫ్రాంక్స్ vs బాలెనో.. ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ :
మారుతి సుజుకి (Fronx) రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ (89.7PS/113Nm), 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ (100PS/147.6Nm). 1.2-లీటర్ యూనిట్‌ను 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో పెయిర్ చేయొచ్చు. అయితే, 1.0-లీటర్ యూనిట్‌ను 5-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ATతో యాడ్ చేయొచ్చు.

Maruti Suzuki Fronx vs Maruti Suzuki Baleno: Price, specifications compare

Maruti Suzuki Fronx vs Maruti Suzuki Baleno: Price, specifications compare

మరోవైపు, బాలెనోలో 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్ (89.7PS/113Nm) 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ (77.4PS/98.5Nm) 5-స్పీడ్ MTతో CNG ఆప్షన్ కలిగి ఉంది.

ఫ్రాంక్స్ vs బాలెనో : మైలేజ్ ఎంతంటే? :
మైలేజీ పరంగా, బాలెనో ఫ్రాంక్స్ కన్నా కొంచెం మెరుగ్గా ఉంటుంది.

* ఫ్రాంక్స్ 1.0 MT – 21.5kmpl
* ఫ్రాంక్స్ 1.0 AT – 20.01kmpl
* ఫ్రాంక్స్ 1.2 MT – 21.79kmpl
* ఫ్రాంక్స్ 1.2 AMT – 22.89kmpl
* బాలెనో 1.2 MT – 22.35kmpl
* బాలెనో 1.2 AMT – 22.94kmpl
* బాలెనో CNG – 30.61kmpkg

ఫ్రాంక్స్ (Fronx) vs Baleno) : ధర ఎంతంటే? :
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ. 6.75 లక్షల నుంచి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని భావిస్తున్నాము. మారుతి సుజుకి బాలెనో ధర రూ. 6.61 లక్షలతో మొదలై రూ. 9.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

Read Also : Suzuki Motorcycle : కొత్త బైకు కొంటున్నారా? థర్డ్ జనరేషన్ కలర్ ఆప్షన్లతో లేటెస్ట్ సుజుకి బైక్ ఇదిగో.. ధర ఎంతో తెలుసా?