Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. మీ ఫోన్ ఛార్జింగ్ కోసం ఇలాంటి ప్రాంతాల్లో పబ్లిక్ ఛార్జర్లను వాడితే అంతే సంగతులు.. ఎందుకు వాడకూడదో తెలిస్తే షాకవుతారు..

Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Public chargers in malls, Markets And Other Places Are Not Safe to use, here is why

Public Chargers in Malls : మీ ఫోన్‌‌కు ఛార్జింగ్ లేదా? బ్యాటరీ లో ఉందా? పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. ఇలాంటి పబ్లిక్ లొకేషన్లలో ఇన్‌స్టాల్ చేసిన ఛార్జింగ్ పాయింట్లు చాలా డేంజరస్.. సొంత ఛార్జర్ లేని వాళ్లు పబ్లిక్ ఛార్జర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. పబ్లిక్ ఛార్జర్‌లు మీరు అనుకున్నంత సేఫ్ కాదని గుర్తించుకోండి. వాస్తవానికి, షాపింగ్ మాల్‌ (Shopping Malls), పబ్లిక్ మార్కెట్ (Public Market) వంటి ప్రదేశాలలో కనిపించే పబ్లిక్ ఛార్జర్‌ (Public Chargers)లను ఉపయోగించకూడదు. సొంత పవర్ బ్యాంక్‌ (Power Bank) వెంట తీసుకెళ్లాలనిఅమెరికాలోని యూజర్లకు (FBI0) ఇటీవల సూచనలు చేసింది.

హ్యాకింగ్ ప్రమాదాలపై ఆందోళనల నేపథ్యంలో.. విమానాశ్రయాలు, హోటళ్లు లేదా షాపింగ్ సెంటర్లలో ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించడం మానుకోండి. ఇలాంటి ప్రాంతాల్లో సైబర్ మోసగాళ్లు.. మాల్వేర్, మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను డివైజ్‌లో ఇంజెక్ట్ చేస్తారు. ఎక్కువగా పబ్లిక్ USB పోర్ట్‌లను మోసాలకు వాడుతున్నారు.

మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంట సొంత ఛార్జర్, USB కార్డ్‌ని తీసుకెళ్లండి. లేదంటే.. ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌ని ఉపయోగించాలని FBI అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 2021లో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (FCC) పబ్లిక్ ఛార్జింగ్ డాక్‌లలో హైజాకింగ్ ‘జ్యూస్ జాకింగ్’ వంటి ప్రమాదాలను హెచ్చరించింది.

Public chargers in malls, Markets And Other Places Are Not Safe to use, here is why

Public chargers in malls, Markets And Other Places Are Not Safe to use

Read Also : Vivo T2 5G Launch : 64MP కెమెరాలతో వివో T2 5G ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

సైబర్ నేరగాళ్లు ఇలాంటి పబ్లిక్ సెంటర్లలో USB పోర్ట్‌లలో డేంజరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. మొబైల్ యూజర్ల ఫోన్ నుంచి నేరుగా వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లను సైబర్ మోసగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉంది. ఇలా దొంగిలించిన డేటాను ఆన్‌లైన్ అకౌంట్లకు యాక్సెస్‌ పొందవచ్చు. ఇతర సైబర్ నేరగాళ్లకు మీ డేటాను విక్రయించవచ్చు. ముందుజాగ్రత్త చర్యగా.. ప్రతి ఆన్‌లైన్ అకౌంట్లకు స్ట్రాంగ్, స్పెసల్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. అంతేకాదు.. ఆయా పాస్‌వర్డులను క్రమం తప్పకుండా మార్చుకోవాలని FBI సూచిస్తోంది.

సైబర్ నేరగాళ్లు.. మాల్‌వేర్‌లను పబ్లిక్ USB ఛార్జింగ్ స్టేషన్‌లలో లోడ్ చేయొచ్చునని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఫేక్ USB పోర్ట్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన మాల్వేర్ డివైజ్ మీ డేటాను లాక్ చేయగలదు. సైబర్ మోసగాళ్లు మీ డేటాను చేరవేయగలదు. వ్యక్తిగత డేటాతో పాటు పాస్‌వర్డ్‌లను కూడా తస్కరించే అవకాశం ఉంది. అందుకే.. విమానాశ్రయాలు, షాపింగ్ సెంటర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ USB పోర్ట్‌లు సర్వసాధారణంగా మారడంతో జ్యూస్ జాకింగ్ వంటి మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తోంది.

Read Also : OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?