OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G ఫోన్ ఫస్ట సేల్ మొదలైందోచ్.. భారత మార్కెట్లో ఏప్రిల్ 11 నుంచి నార్డ్ CE 3 ఫోన్ సేల్‌కు అందుబాటులో ఉంది. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లో కొనుగోలు చేయొచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

OnePlus Nord CE 3 Lite 5G first sale in India today _ Price, specifications and more

OnePlus Nord CE 3 Lite 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి Nord CE 3 Lite ఫస్ట సేల్ భారత మార్కెట్లో ఏప్రిల్ 11 (మంగళవారం) నుంచి మొదలైంది. మిడ్-రేంజ్ ఇయర్‌ఫోన్ సేల్ (OnePlus Nord Buds 2)తో పాటు ప్రారంభమైంది. వన్‌ప్లస్ (Nord CE 3 Lite) డివైజ్ అమెజాన్‌లో (Amazon)లో అలాగే (OnePlus) అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పాటు IPS LCD ప్యానెల్‌తో 120hz, 108-MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. వన్‌ప్లస్ (Nord CE 3 Lite) రెండు మోడళ్లలో అందుబాటులో ఉండనుంది.

అందులో మొదటిది.. 8GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.19,999గా ఉంది. రెండో మోడల్ టాప్-ఎండ్ వెర్షన్, 8GB LPDDR4x RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్ పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ పాస్టెల్ లైమ్ అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ముఖ్యంగా ఫోన్ రిఫ్రెష్‌గా ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ 8GB వర్చువల్ RAMకి సపోర్టు అందిస్తుంది. వన్‌ప్లస్ Nord Buds 2 కూడా లాంచ్ కానుంది. ఈ ఇయర్‌ఫోన్ ధర రూ. 2999 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇయర్‌బడ్‌లు లైట్నింగ్ వైట్, థండర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G first sale in India today _ Price, specifications and more

OnePlus Nord CE 3 Lite 5G first sale in India today 

Read Also : OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

వన్‌ప్లస్ (Nord CE 3 Lite 5G) అనేది పెద్ద 6.72-అంగుళాల FHD+ 120Hz రిఫ్రెష్ రేట్ IPS LCD ప్యానెల్‌తో వచ్చింది. ఈ డివైజ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వచ్చింది. 8GB RAM, 128GB లేదా 256GB ఆన్‌బోర్డ్ మెమరీతో వచ్చింది. సరికొత్త ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్‌OS 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ చేసుకోవచ్చు. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది. బ్యాటరీ ముందు భాగంలో డివైజ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ 195g బరువు, 8.3mm కొలుస్తుంది. మొత్తంమీద, వన్‌ప్లస్ (Nord CE 3 Lite 5G) అనేది పవర్‌పుల్ ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. అధునాతన ఫీచర్‌లతో ప్రీమియం డివైజ్ కోరుకునే యూజర్లను ఆకట్టుకుంటుంది. పెద్ద డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్టైలిష్ ప్యాకేజీలో సరికొత్త గొప్ప టెక్నాలజీ కోరుకునే వారికి ఈ డివైజ్ బెస్ట్ ఆప్షన్ పెంచుకోవచ్చు.

Read Also : Vivo T2 5G Launch : 64MP కెమెరాలతో వివో T2 5G ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!