Vivo T2 5G Launch : 64MP కెమెరాలతో వివో T2 5G ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Vivo T2 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే వివో నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో (Vivo T2 5G) ఫోన్ సరసమైన ధరకే వచ్చింది. ఇప్పుడే కొనేసుకోండి..

Vivo T2 5G Launch : 64MP కెమెరాలతో వివో T2 5G ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Vivo T2 5G launched in India with 64-megapixel dual rear cameras, price starts at Rs 18,999

Vivo T2 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి భారత మార్కెట్లోకి (Vivo T2 5G) ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 5G సపోర్ట్‌తో రూ. 20వేల లోపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమెరా, డిజైన్, పర్పార్మెన్స్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఆధారిత ఫోన్‌ల కోసం చూసే గేమర్‌లకు ఈ వివో 5G ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Vivo T2 ఫోన్ ధర ఎంతంటే? :
వివో T2 ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ భారత మార్కెట్లో రూ. 18,999 ప్రారంభ ధరతో వస్తుంది. 8GB RAM వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. లేటెస్ట్ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ గ్రేడియంట్ ఫినిషింగ్‌తో రెండు కలర్ ఆప్షన్లలో కొత్త 5G ఫోన్‌ను అందిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 18, 2023న ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo India) ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Read Also :  Vivo X90 Series Launch : పిక్సెల్ 7, వన్‌ప్లస్ 11కు పోటీగా వివో X90 సిరీస్.. ఏప్రిల్ 26నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo T2 స్పెసిఫికేషన్లు ఇవే :
కొత్త వివో (Vivo T2) 5G ఫోన్ మోడల్ 6.38-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Full HD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఈ ప్యానెల్ 1,300నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. అంతేకాదు.. డివైజ్ బ్రైట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సూర్యకాంతిలో ఎలాంటి సమస్యలు ఉండవు. ముందు భాగంలో, వాటర్‌డ్రాప్ స్టైల్ నోచ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఒకే కెమెరా ఉంది. బాక్సీ డిజైన్‌తో వస్తుంది. అనేక OEMలు ఒకే డిజైన్‌తో ఫోన్‌లను లాంచ్ చేస్తున్నందున ఈ ఫోన్ ట్రెండ్‌గా మారింది.

Vivo T2 5G launched in India with 64-megapixel dual rear cameras, price starts at Rs 18,999

Vivo T2 5G launched in India with 64-megapixel dual rear cameras

కొత్త Vivo ఫోన్ హుడ్ కింద (Qualcomm Snapdragon) 695 SoCని అందిస్తుంది. రూ. 20వేల లోపు పలు మిడ్-రేంజ్ ఫోన్‌లను అందించింది. కానీ, ఫైన్-ట్యూనింగ్, ప్రతి యూనిట్ షిప్పింగ్ చేసే సాఫ్ట్‌వేర్ కారణంగా ప్రతి ఫోన్‌లో పర్ఫార్మెన్స్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకోవచ్చునని కంపెనీ తెలిపింది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. కొత్త Vivo ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సపోర్టుతో 64-MP ప్రైమరీ కెమెరా ఉంది. మెరుగైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌తో షాట్‌లను క్యాప్చర్ చేసేందుకు 2-MP సెన్సార్‌తో సపోర్టు అందిస్తుంది. సెల్ఫీలకు 16-MP కెమెరా కనిపిస్తుంది. వివో T2 ఫోన్ 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో 44W ఛార్జర్‌ను అందిస్తుంది.

Read Also : Vivo X90 Series Launch : ఈ నెలాఖరులో వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?