Vivo X90 Series Launch : ఈ నెలాఖరులో వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X90 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెలాఖరు (ఏప్రిల్ 2023)లో వివో నుంచి కొత్త X90 సిరీస్ వస్తోంది. రెండు వేరియంట్లలో అద్భుతమైన ఫీచర్లతో రానుంది. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X90 Series Launch : ఈ నెలాఖరులో వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X90, Vivo X90 Pro India Launch Photo Credit : (Vivo)

Vivo X90 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఇండియా (Vivo India) కంపెనీ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. అతి త్వరలో (Vivo X90 Series) భారత్‌లో లాంచ్ కానుంది. లాంచ్ తేదీని మాత్రం చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

టిప్‌స్టర్ ప్రకారం.. వెనిలా (Vivo X90), (Vivo X90 Pro) ఈ నెలాఖరులో భారత్‌లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉందని తెలిపింది. Vivo T2 5G సిరీస్ ఇప్పటికే లాంచ్ కాగా.. రాబోయే Vivo X90, Vivo X90 Pro సిరీస్‌కు సంబంధించి ఫీచర్లను ఫిబ్రవరిలో రివీల్ చేసింది. ఈ X90 సిరీస్ ఫోన్ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 9200 SoCని కలిగి ఉండనుంది. Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ వెనుక కెమెరాలతో రావొచ్చు.

Read Also : Vivo V27 Series Launch : వివో V27 సిరీస్, వివో TWS ఎయిర్ లాంచ్, ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@passionategeekz) ట్వీట్ ప్రకారం.. Vivo X90, Vivo X90 Pro లాంచ్ తేదీ ఏప్రిల్ 11న జరిగే అవకాశం ఉంది. Vivo T2 5G సిరీస్‌ను లాంచ్ చేసిన వెంటనే Vivo X90 లైనప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు టీజర్ రిలీజ్ చేసింది.

Vivo X90, Vivo X90 Pro India Launch Tipped for April-End_ Details

Vivo X90, Vivo X90 Pro India Launch Photo Credit : (Vivo)

వివో X90, వివో X90 Pro, Vivo X90 Pro+ గత ఏడాదిలో నవంబర్‌లో చైనాలో లాంచ్ అయ్యాయి. ఆ తరువాత, వివో ఫిబ్రవరిలో మలేషియాలో వెనిలా Vivo X90, Vivo X90 ప్రోను (MYR) 3,699 (దాదాపు రూ. 71,600), (MYR) 4,999 (సుమారు రూ. 96,800) వద్ద ఒకే 12GB RAM+ వేరియంట్, 25GB స్టోరేజ్ వద్ద రిలీజ్ చేసింది.

వివో X90, వివో X90 Pro స్పెసిఫికేషన్లు (అంచనా) :
Vivo X90, Vivo X90 Pro గ్లోబల్ వేరియంట్‌లు Android 13 ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతాయి. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల Full-HD+ (1,260x 2,800 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 9200 SoCని కలిగి ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్‌లో Vivo కస్టమైజడ్ V2 చిప్‌తో రానున్నాయి.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వెనుక ట్రిపుల్ కెమెరాలతో రావొచ్చు. Vivo X90 కెమెరా సెటప్‌లో 50-MP Sony IMX866 ప్రైమరీ సెన్సార్, 12-MP పోర్ట్రెయిట్ కెమెరా, 12-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. Vivo X90 Pro కెమెరా యూనిట్‌లో 50-MP Sony IMX989 1-అంగుళాల ప్రైమరీ సెన్సార్, 50-MP 50mm IMX758 సెన్సార్, 12-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. రెండు మోడల్స్ 32-MP సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. Vivo X90 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. అదేవిధంగా, ప్రో మోడల్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!