Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Vivo T2 5G Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో వివో బ్రాండ్ నుంచి సరికొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Vivo T2 5G Series (Photo : Google)

Vivo T2 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారీగా విస్తరిస్తోంది. త్వరలో వివో T2 5G సిరీస్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మైక్రోసైట్‌లో ప్రాథమిక సమాచారం కనిపించింది. ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని నివేదిక తెలిపింది.

రాబోయే (Vivo T2 5G) ఫోన్ డిస్‌ప్లేలో సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. అదనంగా, వివో T2 5G స్నాప్‌డ్రాగన్ SoC ద్వారా పనిచేస్తుందని తెలిపింది. అయినప్పటికీ, ఈ చిప్‌సెట్ గురించి మరిన్ని వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.

వివో కంపెనీ చిప్‌సెట్ పేరును ఏప్రిల్ 9న రిలీజ్ చేయనుంది. వివో T2 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని మైక్రోసైట్ ధృవీకరించింది. ఇందులో.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండు వృత్తాకార మాడ్యూల్స్‌లో LED ఫ్లాష్ ఉంటుంది. కచ్చితమైన కెమెరా స్పెసిఫికేషన్లను మాత్రం వివో ఏప్రిల్ 7 వరకు రివీల్ చేయదు.

Vivo T2 5G Series to debut in India, What to expect

Vivo T2 5G Series (Photo : Google)

Read Also : ChatGPT Tech Tips : ఒకే రోజులో రూ. 10వేలు సంపాదించడం ఎలా? అని అడిగితే.. ChatGPT ఎలాంటి టిప్స్ ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు!

Vivo T2 సిరీస్ సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సైజు, రిజల్యూషన్ వంటి మరింత సమాచారం ఏప్రిల్ 5న వెల్లడించనుంది. ఇటీవల, వివో T2 5G ఫోన్.. Google Play కన్సోల్ డేటాబేస్‌లో కనిపించింది.

ఈ మోడల్ నంబర్ Vivo V2222 కింది లిస్టు అయింది. ఈ డివైజ్ ఫుల్-HD+ రిజల్యూషన్‌తో కూడిన వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoC, 8GB RAM, 128GB స్టోరేజీని కలిగి ఉంటుందని లిస్టు సూచిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుందని నివేదిక తెలిపింది.

వివో T2 5G ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. Vivo T2 5G గత ఏడాదిలో లాంచ్ అయిన Vivo T1 5Gకి అప్‌గ్రేడ్‌ వెర్షన్ భావిస్తున్నారు. గత మోడల్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCని కలిగి ఉంది. 6.58-అంగుళాల Full-HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుంది.

Read Also : Vivo V27 Series Launch : వివో V27 సిరీస్, వివో TWS ఎయిర్ లాంచ్, ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?