Tecno Pop 9 Launch : టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 6,999 మాత్రమే.. సేల్ ఎప్పుడంటే?

Tecno Pop 9 Launch : టెక్నో పాప్ 9 ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డీటీఎస్ సౌండ్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి.

Tecno Pop 9 launched in India, price

Tecno Pop 9 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ టెక్నోపాప్ 9ని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ జెన్ జెడ్, జనరేషన్ అల్ఫాఫీచర్లతో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. “లైవ్ లిమిట్‌లెస్” అనే ట్యాగ్‌లైన్‌తో వినోదం, మల్టీ టాస్కింగ్ పవర్‌ఫుల్ డిజైన్‌లను ఇష్టపడే యువ యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు. మీకు ఇష్టమైన షోలను స్ట్రీమింగ్ చేస్తున్నా, సోషల్ మీడియా ద్వారా స్క్రోల్ చేస్తున్నా లేదా ఫొటోలు తీస్తున్నా పాప్ 9 స్టైలిష్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

టెక్నో పాప్ 9 ఫీచర్, స్పెషిఫికేషన్లు :
టెక్నో పాప్ 9 ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డీటీఎస్ సౌండ్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇందులో పవర్‌ఫుల్ డిస్‌ప్లేను రిచ్ ఆడియోను అందిస్తాయి.

హుడ్ కింద పాప్ 9 భారత మొట్టమొదటి మీడియాటెక్ జీ50 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్ (వర్చువల్)తో వస్తుంది. ఒక యాప్ నుంచి మరో యాప్ మధ్య మారడం నుంచి గేమింగ్ వరకు అన్ని టాస్కులను పూర్తి చేయొచ్చు. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

పాప్ 9 దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. టెక్నో కూడా 3 ఏళ్ల లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దీర్ఘకాలిక ఉపయోగానికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

స్టార్‌ట్రైల్ బ్లాక్, గ్లిట్టరీ వైట్ వంటి అద్భుతమైన కలర్ ఆప్షన్‌లతో ఫోన్ డిజైన్ పర్సనల్ టచ్‌ని అందిస్తుంది. టెక్నో కస్టమైజ్ కోసం బాక్స్‌లో అదనపు స్కిన్‌ను కలిగి ఉంది. వినియోగదారులు తమ డివైజ్‌కు ప్రత్యేకమైన లుక్ అందించవచ్చు.

ధర వివరాలివే :
టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 6,499 ధర మాత్రమే. నవంబర్ 26 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ డీల్‌ను మరింత తగ్గింపు పొందాలంటే బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌లో స్టైలిష్, హై-పర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్లకు టెక్నో పాప్ 9 అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : BMW Cars Prices : కొత్త కారు కొంటున్నారా? వచ్చే జనవరి 1 నుంచి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ కార్లు ధరలు!