Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్‌ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?

ప్రముఖ మెసేజింగ్ యాప్ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ ఎట్టకేలకు మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించింది.

Telegram Premium subscription : ప్రముఖ మెసేజింగ్ యాప్ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ ఎట్టకేలకు మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా యూజర్లకు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను యాక్సస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. ఈ మెసేజింగ్ యాప్‌లో ప్రస్తుతం 700 మిలియన్ల మంది యాక్టివ్ నెలవారీ యూజర్లు ఉన్నారు. కేవలం యాడ్స్ వంటి అడ్వటైజర్లపై ఆధారపడని యూజర్లు యాప్ వృద్ధికి సాయపడతారని టెలిగ్రామ్ విశ్వసిస్తోంది. యూజర్లు కొత్త పేమెంట్ సర్వీసుకు సభ్యత్వం పొందాలనుకుంటే ప్రత్యేక ఫీచర్‌లకు యాక్సెస్ కోసం ముందుగా యాప్‌ని అప్‌డేట్ చేయాలి. అయితే, టెలిగ్రామ్ కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కొనడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉండనున్నాయో తెలుసుకుందాం.

టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చా? :
సబ్‌స్క్రిప్షన్‌ ధర చాలా ఎక్కువనే చెప్పాలి. ఫీచర్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. మీది యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ అయితే.. టెలిగ్రామ్ ప్రీమియం సభ్యత్వం కోసం రూ. 460 చెల్లించాల్సి ఉంటుంది. అదే iOS యాప్ కోసం రూ. 469 చెల్లించాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్లను పొందడానికి ఆండ్రాయిడ్ యూజర్లు ఏడాదికి రూ. 5,520 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే స్థాయిలో కంటెంట్‌ను అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఇంత స్థాయిలో ఎక్కువగా యూజర్లను ఛార్జీలను వసూలు చేయడం లేదు. తక్కువ ధరకే ఎక్కువ కంటెంట్ అందించడం నెట్‌ఫ్లిక్స్‌కు సానుకూలంగా మారింది. అందుకే నెట్ ఫ్లిక్స్ చాలా మంది యూజర్లను ఆకర్షించింది.

Telegram Launches Premium Subscription In India Is It Worth Buying

మీరు ప్రైమరీ టెలిగ్రామ్ యూజర్ అయితే.. కొన్ని ఫీచర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా యూజర్లు టెలిగ్రామ్ క్లౌడ్‌లో అన్ లిమిటెడ్ స్టోరేజీ స్పేస్ పొందుతారు. హైక్వాలిటీ వీడియోలను కూడా పంపుకోవచ్చు. ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా 4GB వరకు ఫైల్‌లను షేర్ చేయడానికి అనుమతిస్తుంది.

2GB సైజులో వీడియోలను పంపుకోవచ్చు. మళ్లీ, Google ఫోటోలు అందించిన 100GB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ కోసం యూజర్లు కేవలం ఏడాదికి రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ యానిమేటెడ్ ప్రొఫైల్ పిక్చర్‌లు, ప్రీమియం బ్యాడ్జ్‌లు, హైస్పీడ్ డౌన్‌లోడ్ స్పీడ్, జీరో యాడ్స్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. వాయిస్-టు-టెక్స్ట్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంది. యూజర్లు సులభంగా అర్థం చేసుకునేలా వాయిస్ మెసేజ్ ఆటోమాటిక్ గా ట్రాన్స్ లేట్ అవుతుంది.

Read Also : Telegram Premium : టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? నెలకు ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు