Telegram Premium : టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? నెలకు ఎంతంటే?

Telegram Premium : టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? భారత టెలిగ్రామ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నెల ప్రారంభంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కొన్ని అధునాతన ఫీచర్‌లను రిలీజ్ చేయనుంది.

Telegram Premium : టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? భారత టెలిగ్రామ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కొన్ని అధునాతన ఫీచర్‌లను రిలీజ్ చేయనుంది. ఆయా ఫీచర్లను యాక్సస్ చేసుకోవాలంటే.. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.. 9ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన టెలిగ్రామ్ యాప్ తమ ఫ్రీమియం మోడల్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. టెలిగ్రామ్ ప్రీమియంకు యాక్సెస్ ఉందని టెలిగ్రామ్ గ్రూపులో ఓ స్క్రీన్‌షాట్‌ వైరల్ అవుతోంది. టెలిగ్రామ్ విండోస్ 11 యాప్ స్క్రీన్ షాట్ ప్రకారం.. టెలిగ్రామ్ ప్రీమియం నెలకు రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే టెలిగ్రామ్ ప్రీమియం యాక్సస్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతి ఉంటుంది.

అంతేకాదు.. అదనపు ఫీచర్లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ తీసుకుంటే.. ప్రత్యేకమైన ఫీచర్లను పొందవచ్చు. అంతేకాదు.. టెలిగ్రామ్ ప్రీమియంకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని కోరుతోంది. టెలిగ్రామ్ ప్రీమియం పేజీలోని ఫీచర్ల జాబితాలో రెట్టింపు లిమిట్స్, 4GB అప్‌లోడ్ సైజు, హై‌స్పీడ్ డౌన్‌లోడ్, వాయిస్-టు-టెక్స్ట్ మార్పిడి, ప్రీ యాడ్స్, ప్రత్యేక రియాక్షన్లు, ప్రీమియం స్టిక్కర్లు, అధునాతన చాట్ మేనేజ్‌మెంట్, ప్రొఫైల్ బ్యాడ్జ్, యానిమేటెడ్ ప్రొఫైల్ ఫొటోలు ఉన్నాయి. ప్రీమియం యాప్ ఐకాన్ కూడా పొందవచ్చు.

Telegram Premium Subscription May Cost Rs 349 Per Month In India

ప్రస్తుతం ఈ ఫీచర్లు సాధారణ టెలిగ్రామ్ యూజర్లకు అందుబాటులో లేవు. ఫైల్‌ల అప్‌లోడ్ సైజ్ ప్రస్తుతం 2GBగానే ఉంది. అదే ప్రీమియం యూజర్లు అదనంగా 2GBకి యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉచితంగా వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఫీచర్లు అందుబాటులో ఉంటాయని టెలిగ్రామ్ తెలిపింది. టెలిగ్రామ్ ప్రీమియమ్‌కు సభ్యత్వం పొందని వినియోగదారులు కూడా కొన్ని బెనిఫిట్స్ మాత్రమే పొందగలరు. ప్రీమియం యూజర్లు పంపిన పెద్ద డాక్యుమెంట్‌లు, మీడియా, స్టిక్కర్‌లను చూడవచ్చునని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ టెలిగ్రామ్‌లో రాశారు. టెలిగ్రామ్ ప్రీమియం Twitter బ్లూ టిక్ పోలి ఉంటుంది.

పెయిడ్ యూజర్లకు మాత్రమే ట్వీట్ పోస్టింగ్‌ను రివర్స్ చేసేందుకు Undo Tweet ఆప్షన్ వంటి సర్వీసులకు యాక్సెస్‌ అందిస్తుంది. ప్రస్తుతం Twitter పేర్కొన్న Edit Button ఇది ప్రత్యామ్నాయం. ప్రీమియం కోరుకునే వారికి సబ్‌స్క్రిప్షన్ ఫీచర్లు అవసరం.. లేని వారికి, ఉచిత టైర్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లు సరిపోతాయి.

Read Also : Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్లు.. వాట్సాప్‌ను మించి ప్రైవసీ ఫీచర్లు..!

ట్రెండింగ్ వార్తలు