ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ.. 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు.. గ్యాస్ నింపినంత వేగంగా..!

electric car battery full charge just in five minutes as filling up with gas : టెక్నాలజీలో అగ్రగామి అయిన డ్రాగన్ చైనా.. కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని చైనా ఆవిష్కరించింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఛార్జ్ చేయవచ్చు. వాస్తవానికి.. ప్రామాణిక ఎలక్ట్రిక్-వెహికల్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న అతిపెద్ద అవరోధం ఇదే.. ఇందన కార్ల కంటే.. ఎలక్ట్రిక్ కార్లతో ఉద్గారాలను తగ్గించవచ్చు.. వాతావరణ మార్పులు రాకుండా జాగ్రత్తపడొచ్చు..

కానీ, బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయ్యేంత వరకు వేచి ఉండాలంటే వినియోగదారుల సహనానికి పరీక్ష లాంటిదే. అందుకే చైనా.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల కోసం కొత్త రకం ఛార్జింగ్ బ్యాటరీని కనిపెట్టింది. ఈ బ్యాటరీతో కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.. ఎంతో సమయం ఆదా అవుతుంది కూడా. కార్లలో గ్యాస్ ట్యాంక్ నింపినంత సమయంలోనే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. ఇకపై ఎలాంటి దిగులు చెందక్కర్లేదు అంటోంది.

చైనాలోని ఒక ఫ్యాక్టరీలో ఈ కొత్త రకం బ్యాటరీని మొదటిసారి ఉత్పత్తి చేసింది. కొత్త లిథియం-అయాన్ బ్యాటరీలను ఇజ్రాయెల్ కంపెనీ స్టోర్ డాట్ అభివృద్ధి చేసింది. చైనాలో ఈవ్ ఎనర్జీ దీన్ని తయారు చేసింది. లి-అయాన్ బ్యాటరీ సర్టిఫికేషన్లకు అనుగుణంగా 1,000 శాంపిల్ బ్యాటరీలను కంపెనీ ఉత్పత్తి చేసిందని నివేదిక వెల్లడించింది. బిపి, డైమ్లెర్, శామ్‌సంగ్ వెంచర్స్ TDKతో సహా ఎలక్ట్రిక్-వెహికల్ మార్కెట్లో దూసుకుపోవాలని చూస్తున్న కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కంపెనీ టెక్నాలజీకి ఈ శాంపిల్స్ ఉపయోగపడనున్నాయి. మార్కెట్లో ఎక్కడైనా ఎలక్ట్రిక్-కార్ బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవచ్చు.


ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పట్టవచ్చు. సాధారణ EV ఖాళీ అయిన బ్యాటరీ నుంచి పూర్తి ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ఛార్జీకి సగటున 250 మైళ్ల వరకు డ్రైవింగ్ చేయొచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీలు గ్రాఫైట్‌ను ఎలక్ట్రోడ్‌గా ఉపయోగిస్తున్నాయి. బ్యాటరీ గ్రాఫైట్‌ను సెమీకండక్టర్ నానోపార్టికల్స్‌ ద్వారా వేగంగా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రోడ్‌ను ఈ 2021 చివరినాటికి సిలికాన్‌తో భర్తీ చేయాలని కంపెనీ భావిస్తోంది. సిలికాన్ ఎలక్ట్రోడ్లను అభివృద్ధి చేయడానికి టెస్లా కృషి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు