iPhone 14 Pro Max : ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 5 కోట్లు.. లంబోర్ఘిని హురాకన్ ఎవో సూపర్‌ కారు కన్నా చాలా ఖరీదైనది.. ఎందుకో తెలుసా?

iPhone 14 Pro Max: ఈ ఐఫోన్ డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ అయింది. ఈ ఐఫోన్ ధర 616,000 డాలర్లు (సుమారు రూ. 5 కోట్లు) ఉంటుందని నివేదిక తెలిపింది.

This iPhone 14 Pro Max model is worth Rs 5 crore, more than Lamborghini Huracan Evo

iPhone 14 Pro Max : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అయితే, ఇప్పటికీ ఆపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ అని చెప్పవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర భారత మార్కెట్లో రూ. 1,27,999 నుంచి అందుబాటులో ఉంది. కానీ, ఈ ఐఫోన్ డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ అయింది. దీని ధర ఆశ్చర్యకరంగా $616,000 (సుమారు రూ. 5 కోట్లు). ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.3.7 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధరను అధిగమించింది.

ఈ స్నోఫ్లేక్ ఎడిషన్ బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. ఈ స్పెషల్ డివైజ్‌లు 3 మాత్రమే డివైజ్‌లు ఉన్నాయి. డైమండ్ స్నోఫ్లేక్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్ ప్రత్యేక ఫీచర్ బ్యాక్‌ప్లేట్‌కు అతికించి ఉంటుంది. అదో పెద్ద లాకెట్టు మాదిరిగా కనిపిస్తుంది. ఈ లాకెట్టు ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. చూసేందుకు గుండ్రని మార్క్యూస్-కట్ వజ్రాలతో పొదిగి ఉంది. ఈ లాకెట్టు ధర ఒక్కటే 75వేల డాలర్లు (దాదాపు రూ. 62 లక్షలు). అదనంగా, 18k వైట్ గోల్డ్ బ్యాక్‌ప్లేట్‌ను కలిగి ఉంది. 570 వజ్రాల అమరికను కలిగి ఉంది.

Read Also : iPhone 14 Plus Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ఈ ఐఫోన్ (iPhone 14 Pro Max) మోడల్ ధర.. వాస్తవానికి, ఫోన్ వెనుక భాగంలో ఉన్న డైమండ్-స్టడెడ్ పూత కారణంగా పెరిగింది. వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 1,39,900 లాంచ్ అయింది. ప్రస్తుతం తగ్గింపు ధరతో అమ్మకానికి ఉంది. కానీ, రూ. 1,27,999 ధర ఇప్పటికీ చాలా ఖరీదైనది. డైమండ్ స్నోఫ్లేక్ వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కేవియర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఉత్పత్తికి ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తుంది. విదేశాలకు ప్యాకేజీలు, కరస్పాండెన్స్‌లను పంపడం కోసం చాలా కార్పొరేషన్లు ఉపయోగించే మెయిలింగ్ సర్వీసు ద్వారా డెలివరీ నిర్వహిస్తారు.

iPhone 14 Pro Max model is worth Rs 5 crore, more than Lamborghini Huracan Evo

ఆపిల్ ఐఫోన్ 14 Pro Max ప్లేబుక్‌లో అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ A16 SoCని ఉపయోగిస్తోంది. ఈ ఐఫోన్ చాలా పవర్‌ఫుల్. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 14 Pro మోడల్‌తో పోలిస్తే.. Max వేరియంట్ భారీ సైజు కలిగి ఉంటుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కూడా వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుంది.

మీరు పెద్ద స్క్రీన్, బ్యాటరీని కలిగిన ప్రో వెర్షన్‌తో పోల్చితే.. Max వేరియంట్ అదనంగా రూ. 10వేల ధర ఉంటుంది. అయితే, మాక్స్ వెర్షన్ చాలా బరువు ఉంటుంది. దాదాపు 240 గ్రాములు. కాంపాక్ట్ పాకెట్స్ ఉన్న యూజర్లు ఐఫోన్ 14 ప్రో బాగా సరిపోతుందని చెప్పవచ్చు. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రెండూ ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ 128GB స్టోరేజ్ మోడల్ తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. అయితే, ఈ డీల్ ఎప్పటికి ముగుస్తుందో క్లారిటీ లేదు.

Read Also : Samsung Galaxy M34 5G Launch : శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. రూ. 16,999 ధర మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు