భారత విద్యార్థుల కోసం టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Top 5 best Smartphones for students in India : మీ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి కెమెరా ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ బాగున్న స్మార్ట్ ఫోన్లు అంటే అందరికి ఇష్టమే.. ప్రత్యేకించి భారతీయ విద్యార్థుల కోసం టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..
1. Realme C12 :
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లోకి Realme C12 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇందులో 6.5 అంగుళాల HD+ డిస్ ప్లే, మిని డ్రాప్ నాచ్, ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో G35 Soc స్పెషిఫికేషన్లు ఉన్నాయి.. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, డ్యుయల్ SIM సపోర్ట్, ఒక మైక్రో SD కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ Realme UI ఉన్నాయి..
ఇక కెమెరాల విషయంలోనూ రియల్ మి C12 ఆకట్టుకునేలా ఉంది.. ట్రిపుల్ కెమెరా సెటప్, 13MP ప్రైమరీ సెన్సార్, నాన్ రిమూవబుల్ 6000mAh బ్యాటరీ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీని ధర మార్కెట్లో రూ.8,999 లభ్యం అవుతోంది.
2. POCO M2 Pro :
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఒకటైన POCO M2 Pro సరసమైన ధరకే అందుబాటులో ఉంది. విద్యార్థుల కోసం అందించే స్మార్ట్ ఫోన్లలో ఇదే బెస్ట్ కూడా.. క్వాడ్ కెమెరా మాడ్యుల్ పై 48MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. 5,000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.13,999లకే లభ్యం అవుతోంది.
* ఆండ్రాయిడ్ OS, 10
* 48MP రియర్ కెమెరా
* 4GB /6GB RAM
* 16MP ఫ్రంట్ కెమెరా
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* 64GB/128 GB స్టోరేజీ
* 6.7 అంగుళాల స్ర్కీన్
* 5000mAh బ్యాటరీ
3. Redmi 9 Prime :
బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో రెడ్ మి కంపెనీ ఒకటి.. బడ్జెట్ ఫోన్ల ధరల్లో రూ.9,999లతో అందుబాటులో ఉంది.. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు భారీ సామర్థ్యంతో వస్తున్నాయి.. క్వాడ్ కెమెరా సెటప్, రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 10తో పాటు పైనా MIUI సహా ఇతర ప్రామాణిక ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
* ఆండ్రాయిడ్ OS, 10
* 13MP రియర్ కెమెరా
* 4GB ర్యామ్
* 8MP ఫ్రంట్ కెమెరా
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* 64GB/128 GB స్టోరేజీ
* 6.5 అంగుళాల స్ర్కీన్
* 5000mAh బ్యాటరీ
4. Redmi Note 9 :
రెడ్ మి అందించే నోట్ స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. విద్యార్థులకు Redmi Note 9 బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు.. మీడియా టెక్ హెలియో G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ కూడా ఉంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. 4GB ర్యామ్, 64GB ఆన్ బోర్డ్ స్టోరేజీ, క్వాడ్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్ ఫీచర్లను అందిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.11,999లకే ఆఫర్ చేస్తోంది.
* ఆండ్రాయిడ్ OS, 10
* 48MP రియర్ కెమెరా
* 4GB/6GB ర్యామ్
* 13MP ఫ్రంట్ కెమెరా
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* 64GB/128GB/ 128GB స్టోరేజీ
* 6.5 అంగుళాల స్ర్కీన్
* 5000mAh బ్యాటరీ
5. OPPO A52 :
బెస్ట్ ఆపర్డబుల్ ఫోన్లలో OPPO A52 ఒకటి.. విద్యార్థుల కోసం ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ హార్డ్ వేర్‌తో సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ సాఫ్ట్ వేర్ క్యాపబులిటిస్, క్వాడ్ కెమెరా సెటప్‌తో 12MP ప్రైమరీ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాతో అందిస్తోంది.. కాంటెంపరరీ 3D క్వాడ్ కర్వ్ డిజైన్, కెపాసిటీతో భారీ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.. దీని ధర మార్కెట్లో రూ.16,900లకే లభ్యం అవుతుంది.
https://10tv.in/why-you-should-still-ditch-your-phone-for-a-proper-camera/
* ఆండ్రాయిడ్ OS,10
* 12MP రియర్ కెమెరా
* 6GB RAM
* 16MP ఫ్రంట్ కెమెరా
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* 128GB స్టోరేజీ
* 6.5 అంగుళాల స్క్రీన్
* 5000mAh బ్యాటరీ