ఏకంగా 7000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న 3 స్మార్ట్‌ఫోన్లు ఇవే..

మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఈ మూడు ఫోన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

రోజంతా ఫోన్ వాడుతూనే ఉంటారా? బ్యాటరీ అయిపోతుందని భయపడుతున్నారా? అయితే ఇక ఆ టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లోకి 7000mAh భారీ బ్యాటరీ, దానికి తోడు 120W మెరుపు వేగంతో ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్లు వచ్చేశాయి. వీటిలో ఒక ఫోన్ అయితే కేవలం 15 నిమిషాల్లో సగం ఛార్జ్ అవుతుంది. ఆ పవర్-ప్యాక్డ్ ఫోన్లేంటో చూసేద్దాం..

Oppo K13 5G: బడ్జెట్‌ ధరలో బెస్ట్ బ్యాటరీ ఫోన్

తక్కువ ధరలో మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్..

  • ధర: రూ.17,425 (8GB + 128GB)
  • బ్యాటరీ, ఛార్జింగ్: 7000mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 62% ఛార్జ్)
  • ప్రాసెసర్: రోజువారీ పనులకు సరిపోయే Snapdragon 6 Gen 4
  • కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా
  • ఎవరికి బెస్ట్?: బడ్జెట్ పరిమితిలో ఉంటూ, రోజంతా నిలిచే బ్యాటరీ కోరుకునే వారికి

Also Read: శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై మెగా డిస్కౌంట్..

iQOO Neo 10 

గేమింగ్ అంటే ప్రాణమా? అయితే ఈ ఫోన్ మీకోసమే. అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన డిస్‌ప్లేతో ఇది ఒక కంప్లీట్ గేమింగ్ ప్యాకేజ్ వంటిది.

  • ధర: రూ.31,998 (8GB + 128GB)
  • బ్యాటరీ, ఛార్జింగ్: 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ (19 నిమిషాల్లో 50% ఛార్జ్).
  • డిస్‌ప్లే: 144Hz AMOLED స్క్రీన్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్ (ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది).
  • ప్రాసెసర్: శక్తిమంతమైన Snapdragon 8s Gen 4.
  • ఎవరికి బెస్ట్?: హార్డ్‌కోర్ గేమర్లకు, పర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీ పడని వారికి

Realme GT 7 

అన్నింటికంటే వేగవంతమైన ఛార్జింగ్, టాప్-ఎండ్ ఫీచర్లు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకుంటే Realme GT 7 బెస్ట్ ఆప్షన్.

  • ధర: రూ.39,998 (8GB + 256GB)
  • బ్యాటరీ, ఛార్జింగ్: 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
  • ఛార్జింగ్ స్పీడ్: కేవలం 15 నిమిషాల్లో 50% ఛార్జ్
  • ప్రాసెసర్: అత్యంత శక్తిమంతమైన Dimensity 9400e
  • డిస్‌ప్లే: 8T LTPO స్క్రీన్, 6000 నిట్స్ బ్రైట్‌నెస్
  • ప్రత్యేకత: IP69 రేటింగ్ (నీరు, దుమ్ము నుంచి పూర్తి స్థాయి రక్షణ)
  • ఎవరికి బెస్ట్?: బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి, ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ కావాలనుకునే వారికి

మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఈ మూడు ఫోన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. రోజంతా బ్యాటరీ, నిమిషాల్లో ఛార్జింగ్ అనేవి ఈ మూడు ఫోన్ల కామన్ ఫీచర్లు.