Top 5 Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. పిక్సెల్ 10 ప్రో XL కన్నా అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లలో అంతకుమించి..!

Top 5 Smartphones : కొత్త గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ మాదిరిగా అంతే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Top 5 SmartPhones

Top 5 Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ లాంచ్ అయింది. ఈ పిక్సెల్ ఫోన్‌‌కు పోటీగా మార్కెట్లో అనేక బ్రాండ్ల (Top 5 Smartphones) ఫోన్లు లభ్యమవుతున్నాయి.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, షియోమి 15 అల్ట్రా వరకు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు డిస్‌ప్లే పర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీలో పిక్సెల్ 10 ప్రో XLతో సమానంగా లేదా అంతకుమించిన పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి.. ఏయే ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఉన్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL లాంచ్ అయింది. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ నుంచి శాంసంగ్ S25 అల్ట్రా వరకు అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పిక్సెల్ 10 ప్రో XLతో దీటుగా ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (రూ. 1,30,900) :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, టైటానియం బాడీ, A18 ప్రో చిప్‌తో వస్తుంది. 5x జూమ్‌తో 48MP ట్రిపుల్ కెమెరా, 4685mAh బ్యాటరీతో ఈ ఏడాదిలో పిక్సెల్ 10 ప్రో XLకి అత్యంత పవర్‌ఫుల్ పోటీదారుల్లో ఒకటిగా నిలిచింది.

Read Also : iPhone 17 Series : ఐఫోన్ 17 సిరీస్ వస్తోందోచ్.. ఏకంగా 4 ఐఫోన్లు భయ్యా.. కెమెరా ఫీచర్లు అదుర్స్.. ఏయే దేశాల్లో ధర ఎంత ఉండొచ్చంటే?

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,07,000) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 6.9-అంగుళాల భారీ డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 1TB వరకు స్టోరేజీ సామర్థ్యం ఉన్నాయి. 200MP క్వాడ్-కెమెరా సెటప్, 8K వీడియో రికార్డింగ్, S పెన్, 7 ఏళ్ల అప్‌డేట్స్ పిక్సెల్ 10 ప్రో XL కన్నా అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో (రూ. 1,10,900) :

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO OLED స్క్రీన్, బట్టర్-స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్, A18 ప్రో చిప్‌తో ప్రీమియం పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 48MP ప్రైమరీ, 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. పవర్‌ఫుల్ ఫొటోగ్రఫీతో ఆపిల్ డిజైన్‌తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL కన్నా బెటర్ ఫీచర్లను కలిగి ఉంది.

వివో X200 ప్రో (రూ. 87,990) :
వివో X200 ప్రో 6.78-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 9400 చిప్, అద్భుతమైన 200MP టెలిఫోటో సెన్సార్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీ 6000mAh బ్యాటరీతో కూడిన ఈ కెమెరా-ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ క్రియేటర్లు, పవర్ యూజర్ల కోసం రూపొందించింది. పిక్సెల్ 10 ప్రో XLకి గట్టిపోటీని అందిస్తోంది.

షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ 6.73-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్‌, 3200 నిట్స్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్‌తో వస్తుంది. 5410mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, లైకా-ట్యూన్ ద్వారా 50MP + 200MP క్వాడ్ కెమెరాలతో 2025లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLకి పోటీదారుగా నిలిచింది.