iPhone 17 Series : ఐఫోన్ 17 సిరీస్ వస్తోందోచ్.. ఏకంగా 4 ఐఫోన్లు భయ్యా.. కెమెరా ఫీచర్లు అదుర్స్.. ఏయే దేశాల్లో ధర ఎంత ఉండొచ్చంటే?
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

iPhone 17 Series
iPhone 17 Series : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్లోకి ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. సెప్టెంబర్ 9, 2025న ఈ ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series) లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి.
ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి. ఈ ఐఫోన్ 17 సిరీస్ కచ్చితంగా మార్కెట్‌ను ఆక్రమించబోతుంది. ఇప్పుడు లీక్‌లు కూడా అదే సూచిస్తున్నాయి. ఇంకా, ఎయిర్ వేరియంట్ ప్లస్ మోడళ్ల స్థానంలో రానుంది.
ఐఫోన్ 17 సిరీస్ ధరలు (అంచనా) :
భారత మార్కెట్లో ఐఫోన్ 17 ధర రూ. 89,900, అమెరికాలో 899 డాలర్లు, దుబాయ్‌లో AED 3300, కెనడాలో CAD 1,248
ఐఫోన్ 17 ఎయిర్ : భారత మార్కెట్లో ధర రూ. 99,900, అమెరికాలో 999 డాలర్లు, దుబాయ్‌లో AED 3699, కెనడాలో CAD 1,386.
ఐఫోన్ 17 ప్రో : భారత్‌లో ధర రూ. 1,24,900, అమెరికాలో 1299 డాలర్లు, దుబాయ్‌లో AED 4700, కెనడాలో CAD 1,803
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : భారత మార్కెట్లో ధర రూ. 1,64,900, అమెరికాలో 1799 డాలర్లు, దుబాయ్‌లో AED 6599, కెనడాలో CAD 2,498.
ఐఫోన్ 17 సిరీస్ డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 17 గత మోడల్ నుంచి అనేక డిజైన్ వివరాలు రివీల్ చేసింది. 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్ కన్నా కొంచెం భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, ఆపిల్ A19 ప్రాసెసర్‌ను కలిగి ఉండవచ్చు.
ఐఫోన్ 17 ఎయిర్ :
ఐఫోన్ 17 ఎయిర్ సరికొత్త డిజైన్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ పిక్సెల్ లాంటి కెమెరా ఐలాండ్ ఉండొచ్చు. ఇందులో సింగిల్ సెన్సార్, ఫ్లాష్ ఉంటాయి. ఈ ఐఫోన్ 17 ఎయిర్ బేస్ వేరియంట్ మాదిరిగానే ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. సింగిల్ 48MP బ్యాక్ సెన్సార్ ఉండవచ్చు.
ఐఫోన్ 17 ప్రో, ప్రో 17 ప్రో మాక్స్ :
ఈ ఐఫోన్ మెయిన్ డిజైన్ ఓవర్‌హాల్ కలిగి ఉండొచ్చు. బ్యాక్ సైడ్ 3 సెన్సార్ కటౌట్‌లు, ఫ్లాష్‌తో కొత్త సెన్సార్ ఐలాండ్ ఉండొచ్చు. ఆపిల్ లోగో ప్లేస్‌మెంట్ కూడా కొంచెం పక్కకు జరిగినట్టు కనిపిస్తోంది. 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు.
12GB ర్యామ్‌తో ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌లో రన్ అవుతాయని అంచనా. ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ప్రోమోషన్ డిస్‌ప్లే కలిగి ఉండొచ్చు. ఈ 4 ఐఫోన్‌లలో ఫ్రంట్ కెమెరా అప్‌గ్రేడ్, 12MP ఫోన్ స్థానంలో 24MP ఫ్రంట్ స్నాపర్ రానుంది.