Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 799 ప్లాన్ ఇంకా ఉంది.. తొలగించలేదు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio : రిలయన్స్ జియో రూ. 799 ప్లాన్ తొలగించలేదు. టెల్కో ఇప్పటికీ ఈ ప్లాన్‌ను అందిస్తోంది. ఇలా ప్లాన్ కోసం చెక్ చేసి చూడండి.

Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 799 ప్లాన్ ఇంకా ఉంది.. తొలగించలేదు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio

Updated On : August 21, 2025 / 4:47 PM IST

Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో రూ.799 ప్లాన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ కనిపించకపోవడంతో చాలామంది యూజర్లలో ఆందోళన మొదలైంది. రూ.799 ప్లాన్ కూడా జియో తొలగించి ఉంటుందని అందరూ భావించారు. వాస్తవానికి ఈ రీఛార్జ్ ప్లాన్ అలానే ఉంది. జియో తొలగించలేదు.

Reliance Jio : ఈ యాప్స్ లో చెక్ చేయండి :

కొన్ని టెక్నికల్ రీజన్ల వల్ల ప్లాన్ హైడ్ అయింది. మీరు 1.5GB రోజువారీ డేటా విభాగంలో ప్లాన్ కోసం చూస్తుంటే అక్కడ ఈ ప్లాన్ కనిపించదు. మీరు MyJio యాప్‌లో ప్లాన్ కోసం మాన్యువల్‌గా సెర్చ్ చేయాలి. అంతే, మీకు రూ.799 ప్లాన్ కనిపిస్తుంది. CRED, PhonePe వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇప్పుడే ఓసారి చెక్ చేసి చూడండి.

రిలయన్స్ జియో వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపంగా ఇలా జరిగి ఉండొచ్చు. టెల్కో ఇప్పటికీ వినియోగదారులకు ఈ ప్లాన్‌ను అందిస్తోంది. ఇకపై కూడా రూ. 799 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, వెబ్‌సైట్, మైజియో యాప్‌లో ఈ ఎర్రర్ ఎప్పుడు పరిష్కరిస్తారో చూడాలి.

Read Also : Vivo V30 Pro 5G vs Vivo T4 Ultra : వివో లవర్స్ కోసం రెండు అద్భుతమైన ఫోన్లు.. ఇందులో మీకు ఏ ఫోన్ బెస్ట్ అంటే?

రూ.249 ప్లాన్ తొలగింపు :

ఈ రీఛార్జ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా సెక్షన్ కింద కూడా కనిపిస్తుంది. రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ప్లాన్ల నుంచి రూ.249 ప్లాన్‌ తొలగించింది. దాంతో వినియోగదారుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. రూ.249 ప్లాన్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేనప్పటికీ రీఛార్జ్ చేసుకోవచ్చు.

అది ఎలాగంటే జియో స్టోర్‌కు వెళ్లి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఇకపై (MyJio) యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా రూ.249 ప్లాన్‌ చౌకౌన ప్లాన్ల నుంచి తొలగించింది.

ఇకపై మొబైల్ యూజర్లు ఖరీదైన ప్లాన్‌లతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా టెల్కో కంపెనీలు భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందనున్నాయి. ఫలితంగా (ARPU) కూడా మెరుగుపడుతుంది. రిలయన్స్ జియో, ఇతర టెల్కోలు రాబోయే రోజుల్లో ARPU పెంచే ప్లాన్లలో మరిన్ని మార్పులు చేస్తాయని భావిస్తున్నారు.