Top 5 Smartphones (Image Credit To Original Source)
Top 5 Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మీ బడ్జెట్ ధరలోనే మార్కెట్లో అదిరిపోయే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఈ ఆఫర్లను పొందవచ్చు. అమెజాన్ సేల్ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ సేల్ సమయంలో వివిధ బ్రాండ్ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే అమెజాన్ కూడా సేల్ ప్రారంభానికి ముందే అనేక స్మార్ట్‌ఫోన్లపై క్రేజీ ఆఫర్‌లను వెల్లడించింది. ప్రస్తుతం రూ. 10వేల కన్నా తక్కువ ధరలో ఏయే ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
రెడ్‌మి A4 5G :
ఈ సేల్ సమయంలో రెడ్‌మి ఫోన్ రూ. 8,299 ధరకు వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.
Top 5 Smartphones (Image Credit To Original Source)
శాంసంగ్ గెలాక్సీ M07 :
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ రూ. 7,499 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 7.6mm సన్నని ఫ్రేమ్, 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా హీలియో G99 ప్రాసెసర్ ఉన్నాయి.
Read Also : Apple iPhone 15 : రిపబ్లిక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!
రియల్‌మి నార్జో 80 లైట్ 4G 5G :
ఈ రియల్‌మి ఫోన్ ధర రూ.7,899కు లభిస్తోంది. IP54 రేటింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లే, 7.94mm సన్నని బాడీ 6300mAh బ్యాటరీతో వస్తుంది.
లావా బోల్డ్ N1 ఫోన్ :
ఈ సేల్ సమయంలో లావా ఫోన్ ధర రూ.7,249. 5000mAh బ్యాటరీ, ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్, 6.75-అంగుళాల స్క్రీన్ 13MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M06 :
ఈ సేల్ సమయంలో శాంసంగ్ ఫోన్ ధర రూ.9,249గా ఉంది. 5000mAh బ్యాటరీ, 8MP సెల్ఫీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉన్నాయి.