Top 5 Smartphones : వైర్‌లెస్ ఛార్జింగ్‌, బిగ్ బ్యాటరీతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Top 5 Smartphones : వైర్ లెస్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్లు కావాలా? మీకోసం టాప్ 5 స్మార్ట్ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం..

Top 5 Smartphones

Top 5 Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు (Top 5 Smartphones) అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. హై-ఎండ్ పర్ఫార్మెన్స్ లేకున్నా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తాయి.

Read Also : Credit Score : ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ లోన్లతో క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా? ఏం చేస్తే బెటర్?

వినియోగదారులకు వైర్-ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. మంచి కెమెరాలతో పాటు బ్యాటరీ లైఫ్‌, వైర్‌లెస్ ఛార్జింగ్‌ కలిగిన ఈ ఫోన్లు మార్కెట్‌లో తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.

ముఖ్యంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 స్మార్ట్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో :
మోటోరోలా ఫోన్ 6000mAh బ్యాటరీ, స్పీడ్ 90W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఫోన్‌ పవర్ బ్యాంక్‌గా పనిచేస్తుంది.

6.7-అంగుళాల OLED స్క్రీన్, 1220p రిజల్యూషన్, పాంటోన్-వెరిఫైడ్ విజువల్స్, సిల్కీ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. రెండు 50MP సెన్సార్లు, 10MP టెలిఫోటోతో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, 8GB ర్యామ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE :
ఈ శాంసంగ్ ఫోన్ చాలా బరువుతో పాటు కొంచెం చిన్నదిగా ఉంటుంది. 4700mAh బ్యాటరీ చిన్నదిగా ఉన్నా శాంసంగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టు అందిస్తుంది.

6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. కానీ, 1080p లో రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా 12MP, 8MPతో 50MP ప్రైమరీ సెన్సార్‌పై ఉంటుంది. స్పీడ్ ప్రాసెసింగ్‌ కోసం ఎక్సినోస్ 2400e పవర్ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ GT 30 ప్రో :
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు కలిగి ఉంది. 5500mAh బ్యాటరీ, సిల్కీ స్మూత్ 144Hz అమోల్డ్ స్క్రీన్ ఉన్నాయి. 108MP ప్రైమరీ కెమెరా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

అయితే, 13MP ఫ్రంట్ షూటర్ ఫ్రంట్ కలిగి ఉంది. డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ద్వారా పవర్ పొందుతుంది. 3.35GHz వద్ద క్లాక్ అవుతుంది. 8GB ర్యామ్‌తో పాటు 12GB వర్చువల్ ఎక్స్‌పాన్షన్ కూడా ఉంది. డెడికేటెడ్ కార్డ్ స్లాట్‌తో కూడా వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 :
ఈ శాంసంగ్ ఫోన్ చాలా సన్నగా లైట్ వెయిట్ ఉంటుంది. 4000mAh బ్యాటరీ చిన్నదిగా ఉంటుంది. వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ సపోర్టు కలిగి ఉంది. 6.2-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, రిచ్ విజువల్స్‌ అందిస్తుంది.

అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికులు 4K@60fps రికార్డింగ్‌తో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ పొందవచ్చు.

Read Also : Realme C71 : అతి చౌకైన ధరకే రియల్‌మి C71 ఆగయా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఏఐ కెమెరా కేక..! 

వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ కలిగి ఉంది. 100W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్, భారీ 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. 6.82-అంగుళాల LTPO అమోల్డ్ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.

1440p రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్స్‌ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 12GB ర్యామ్, సోనీ ఆప్టిక్స్ సపోర్టుతో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ మల్టీఫేస్ ఫొటోగ్రఫీని అందిస్తుంది.