అతి తక్కువ ధరకు వచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..

వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మీకు ఏ స్మార్ట్‌ఫోన్‌ బాగుంటుందో అంచనాకు రావచ్చు.

అతి తక్కువ ధరకు వచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? Redmi 13C-ఎస్టిమేషన్స్ కర్వ్, రియల్‌మీ Narzo N53, పొకొ C65, శాంసంగ్ Galaxy M04, ఇన్ఫినిక్స్‌ Smart 8 స్మార్ట్‌ఫోన్లు కేవలం రూ.9 వేలలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మీకు ఏ స్మార్ట్‌ఫోన్‌ బాగుంటుందో అంచనాకు రావచ్చు.

Redmi 13C-ఎస్టిమేషన్స్ కర్వ్ 
Redmi 13C తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్. కేవలం రూ.7,999కే అందుబాటులో ఉంది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. MediaTek Helio G85తో రన్ అవుతుంది. ఏకంగా 5,000mAh బ్యాటరీ సామర్థ్యం ఈ స్మార్ట్‌ఫోనులో ఉంది.

రియల్‌మీ Narzo N53
రియల్‌మీ Narzo N53 ధర సుమారు రూ.8,999. ఈ ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లే, Unisoc T612 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. నిప్పాన్ 33W స్పీడ్ ఛార్జర్ ఇందులో ఉంటుంది. దీని ద్వారా అతి త్వరగా స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ అవుతుంది. బ్యాక్‌సైడ్‌ 50 MP కెమెరా ఉంటుంది.

Also Read: మోటోరోలా Razr 60 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో..

Poco C65-సుమారు 8499
పొకొ C65 స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.8499. పొకొ C65 90Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది మీడియాటెక్ హెలియో G85 ద్వారా మిడ్-లెవల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉంది. ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

శాంసంగ్ Galaxy M04
శాంసంగ్ Galaxy M04 ధర సుమారు రూ.7999. 6.5-అంగుళాల డిస్ప్లే, MediaTek Helio P35 చిప్‌తో ఇది వచ్చింది. ఈ ఫోన్ RAM Plusతో సపోర్టు చేసే 4GB RAMతో అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000mAh.

ఇన్ఫినిక్స్ Smart 8
ఇన్ఫినిక్స్ Smart 8 ధర సుమారు రూ.6999. ఇది HD+ 6.6 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. Unisoc T606 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP AI కెమెరాతో వచ్చింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.