Waterproof Smartphones
Waterproof Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వాటర్ ప్రూఫ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
రియల్‌మి P3x 5G :
ఫ్లిప్‌కార్ట్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రియల్‌మి P3x 5G ఫోన్ ధర రూ.12,999కి విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్‌లిమిటెడ్ 5శాతం తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి P3x 5Gపై IP68 + IP69 రేటింగ్ కలిగి ఉంది. LCD స్క్రీన్ 6.72-అంగుళాలతో మీడియాటెక్ డైమన్షిటీ 6400 ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేయవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో 5G :
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14ప్రో 5G మోడల్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ధర రూ.21,489కు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లావాదేవీలపై 10శాతం తగ్గింపు (రూ.1250 వరకు) లభిస్తుంది. దాంతో ధర రూ.20,239 అవుతుంది. రెడ్‌మి నోట్ 14ప్రో 5Gపై IP68 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 1.5K 3D కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రూ.22,999కి విక్రయిస్తోంది. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై బ్యాంక్ రూ.1500 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌తో ఫైనల్ ధర రూ.21,499 అవుతుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లోని డిస్‌ప్లే 6.67 అంగుళాలు కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. 68W వద్ద ఛార్జ్ చేయవచ్చు. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
ఒప్పో రెనో 13 5G :
ఫ్లిప్‌కార్ట్ ఒప్పో రెనో 13 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రూ.35,999కు అందిస్తుంది. బ్యాంక్ ప్రమోషన్ల విషయానికొస్తే.. ఏదైనా బ్యాంక్ కార్డ్‌తో రూ.3,599 డిస్కౌంట్ లభిస్తుంది. తగ్గింపు ధర రూ.32,400 అవుతుంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది.
ఒప్పో రెనో 13 5G ఫోన్ 1.5K ఫ్లాట్ OLED కర్వ్డ్ డిస్‌ప్లే 6.59 అంగుళాలు ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 4nm ఆక్టా కోర్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 5800mAh బ్యాటరీ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Read Also : Vivo Y04 Series : వివో కొత్త Y04s, Y04e ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి భయ్యా..!
శాంసంగ్ గెలాక్సీ S25 5G :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ధర రూ.65,790కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ ప్రకారం.. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. 7.5 శాతం తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. మొత్తం ఖర్చు రూ.64,790 అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.