6 Best Camera Phones : ఫోన్లు భలే ఉన్నాయి.. ఈ 6 కెమెరా ఫోన్లు పిక్సెల్ 9a కన్నా తోపు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
6 Best Camera Phones : కెమెరా ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ 6 కెమెరా ఫోన్లు భలే ఉన్నాయి.. పిక్సెల్ 9a కన్నా చాలా బెటర్.. ఓసారి లుక్కేయండి..

Best Camera Phones
6 Best Camera Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a మాదిరి అద్భుతమైన కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరా క్వాలిటీ (Best Camera Phones) పరంగా చాలా బాగుంటాయి.
ఆండ్రాయిడ్ యూజర్లు ఏదైనా కొత్త కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. హై రిజల్యూషన్ సెన్సార్లు, టెలిఫోటో లెన్స్‌లు, క్రిస్ప్ సెల్ఫీలతో పిక్సెల్ 9aకి పోటీగా 6 కెమెరా-ఫోకస్డ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
ఐక్యూ 12 (రూ. 44,999) :
ఐక్యూ 12 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రధాన లెన్స్, 2x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ షూటర్‌ను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీకి పవర్ అందిస్తుంది.
వన్‌ప్లస్ 13R (రూ. 39,867) :
వన్‌ప్లస్ 13R ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో (2x జూమ్), 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. 80W ఛార్జింగ్‌తో కూడిన 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (రూ. 49,999) :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ద్వారా పవర్ అందిస్తుంది. కెమెరా వారీగా 50MP మెయిన్ కెమెరా, 64MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్, 50MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఈ మోడల్ 4500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A56 (రూ. 35,999) :
శాంసంగ్ గెలాక్సీ A56 ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A56 ఎక్సినోస్ 1580 చిప్‌పై రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. 50MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.
ఒప్పో రెనో 13 ప్రో (రూ. 49,999) :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెనో 13 ప్రో డైమెన్సిటీ 8350 చిప్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ (3.5x జూమ్), 8MP అల్ట్రావైడ్ లెన్స్, అద్భుతమైన 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5800mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి GT 7T (రూ. 34,999) :
రియల్‌మి GT 7T ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే.. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.